చిరు సర్‌ప్రైజ్ గిఫ్ట్…ఎమోషనల్ అయిన డైరెక్టర్
భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది.
సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా మూవీలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. వీటి తర్వాత బాబీ తో మెగాస్టార్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చునని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ డైరెక్టర్‌కు చిరు నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది. ఎస్ !తాజాగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. సుమారు 6- 10 లక్షల పైగా విలువ చేసే ఒమేగా సీమాస్టర్ వాచ్ ని బాబీకి గిఫ్ట్ గా అందించాడు చిరంజీవి. ఈ విషయాన్ని డైరెక్టరే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘చిరంజీవి గారి నుంచి నాకు మెగా సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ బహుమతికి నేను అస్సలు వెలకట్టలేను. థాంక్యూ అన్నయ్యా! ఈ స్పెషల్ గిఫ్ట్‌ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని చిరంజీవిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు బాబీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
720 మందితో కైలాస మానస సరోవర యాత్ర.. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి షురూ..
మహిళ అస్థిపంజరాన్ని తవ్వి తీసి.. సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే..
ఐదు రోజుల్లో ఎవరెస్ట్ ఎక్కేసారు! యమా స్పీడ్‌గా ఎలా అంటే ..
ఓరీ దేవుడో..! ఇంటి పైకప్పుతో పాటు ఎగిరిపోయిన చిన్నారులు
హీరోయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై రిపోర్టర్ వెకిలి ప్రశ్న.. ఇచ్చిపడేసిన స్టార్

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
