పేద పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేతులెత్తి మొక్కే నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పలు సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోలు పలు ఛారిటీల ద్వారా ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటారు. హీరోలే కాదు వారి ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు కొన్ని సేవాకార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తన పుట్టిన రోజు చిన్న పిల్లల కోసం గొప్ప సాయం చేశాడు.
రీసెంట్ గానే మోహన్ లాల్ తుడరుమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నారు. హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సహాయక పాత్రలు కూడా చేస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తన 65వ జన్మదినం సందర్భంగా, విశ్వసంతి ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు బేబీ మెమోరియల్ హాస్పిటల్‌తో కలిసి సబ్సిడీ రేట్లలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను అందించనున్నారు.చిన్న పిల్లలుకు పిల్లలకు తక్కువ ఖర్చుతో చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా, యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు “బీ ఎ హీరో” అనే ఏడాది పొడవునా నడిచే యాంటీ-డ్రగ్ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించారు. ఇంకా, గతంలో కూడా మోహన్‌లాల్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024లో వయనాడ్ విపత్తు బాధితుల పునరావాసం కోసం రూ.3 కోట్ల విరాళం అందించారు అలాగే యు రెస్క్యూ ఆపరేషన్స్‌లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న పిల్లల కోసం మోహన్ లాల్ సాయం చేయడం పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు సర్‌ప్రైజ్ గిఫ్ట్…ఎమోషనల్ అయిన డైరెక్టర్
720 మందితో కైలాస మానస సరోవర యాత్ర.. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి షురూ..
మహిళ అస్థిపంజరాన్ని తవ్వి తీసి.. సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే..

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
