720 మందితో కైలాస మానస సరోవర యాత్ర.. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి షురూ..
అయిదేళ్ల బ్రేక్ తర్వాత ఈ ఏడాది కైలాస మానస సరోవర యాత్ర జరగనుంది. ఈసారి 720 మంది భక్తులు ఆ యాత్రకు వెళ్లనున్నారు. వీరితో పాటు 30 మంది లయజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ తెలిపింది. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో ర్యాండమ్ లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు. గత అయిదేళ్ల నుంచి మానస సరోవర యాత్ర జరగడం లేదు.
2020లో కోవిడ్ కారణంగా నిలిపివేశారు. చైనీస్ ప్రభుత్వం వైపు నుంచి యాత్ర ఏర్పాట్ల గురించి సమాచారం రాకపోవడంతో మానస సరోవర యాత్రను ఆపేశారు. జూన్ మూడవ వారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర ఆగస్టు 25వ తేదీన ముగుస్తుంది. ఈసారి రెండు మార్గాల్లో మానస సరోవర యాత్రను నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్, సిక్కిం రూట్లు కలిపి మొత్తం 720 మంది యాత్రికులకు మాత్రమే ఈ సారి అవకాశం కల్పించారు. ఉత్తరాఖండ్ మార్గంలో 5 బ్యాచ్‌లను పంపుతారు. ఒక్కొక్క బ్యాచ్‌లో 48 మంది ఉంటారు. ఇక సిక్కింలోని నాథులా పాస్ మీదుగా 48 మందితో కూడిన 10 బ్యాచ్‌లను పంపనున్నారు. కైలాస పర్వతంతో పాటు మానస సరోవరం టిబెట్‌లో ఉన్నాయి. ఈసారి 5384 మంది యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3898 మంది పురుషులు కాగా 1486 మంది మహిళలు. 65 ఏళ్లు దాటిన వారు 404 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హిందువులతో పాటు బౌద్దులు, జైనులకు కూడా ఈ యాత్ర పవిత్రమైందని విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. లిపులేక్ పాస్, నాథులా పాస్ మార్గంలో రోడ్లను కూడా నిర్మించారని, దీని వల్ల వృద్ధ యాత్రికులకు మేలు జరుగుతుందన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ అస్థిపంజరాన్ని తవ్వి తీసి.. సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే..
ఐదు రోజుల్లో ఎవరెస్ట్ ఎక్కేసారు! యమా స్పీడ్‌గా ఎలా అంటే ..
ఓరీ దేవుడో..! ఇంటి పైకప్పుతో పాటు ఎగిరిపోయిన చిన్నారులు
హీరోయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై రిపోర్టర్ వెకిలి ప్రశ్న.. ఇచ్చిపడేసిన స్టార్

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
