Chiranjeevi: విశ్వంభర తర్వాత మెగాస్టార్‌ సినిమా ఆ డైరెక్టర్‌తోనేనట..!

Chiranjeevi: విశ్వంభర తర్వాత మెగాస్టార్‌ సినిమా ఆ డైరెక్టర్‌తోనేనట..!

Anil kumar poka

|

Updated on: May 24, 2024 | 7:41 AM

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో, శ్రీవశిష్ఠ దర్శకత్వంలో.. యూవీ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి ఏ దర్శకుడితో చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలామంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో, శ్రీవశిష్ఠ దర్శకత్వంలో.. యూవీ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి ఏ దర్శకుడితో చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలామంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మరోసారి దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు మోహన్ రాజా – చిరంజీవి కాంబినేషన్లో గాడ్ ఫాదర్ సినిమా వచ్చింది. లూసిఫర్ రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 2022లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ, చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ముందుగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే మోహన్ రాజా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక మారుతి .. హరీశ్ శంకర్ దర్శకత్వంలోను చిరంజీవి సినిమాలు చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: May 24, 2024 07:33 AM