మంచు విష్ణుకు బిగ్ షాక్ ‘కన్నప్ప’ సినిమా హార్డ్‌డిస్క్ చోరీ..
ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందే కష్టాల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఫిలింనగర్‌లో కలకలం రేపింది.
అదృశ్య శక్తుల ప్రోద్బలంతో.. అంటూ 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. చరిత అనే యువతితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ట్వంట్వీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కన్నప్ప సినిమాకు చెందిన ముఖ్యమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబయి నుంచి ఇటీవల కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిలింనగర్‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ పార్శిల్‌ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్‌బాయ్ రఘు అందుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పకుండా దానిని చరిత అనే మహిళకు ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. తమ సినిమా ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గుర్తుతెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు, చరిత ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్‌కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హార్డ్‌డ్రైవ్ అపహరణ వెనుక ఉన్న వ్యక్తులను, వారి ఉద్దేశాలను కనుగొనే పనిలో నిమగ్నమైనట్టు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిటైర్ అవుతున్న యజమాని.. వీడ్కోలు పలికిన శునకం..
‘టాకింగ్ ట్రీ’.. కబుర్లు చెబుదామా! AIతో వండర్ చేసిన ట్రినిటి పరిశోధకులు
గల్ఫ్ దేశాలకు క్యూ కడుతున్న కోటీశ్వరులు! కారణమేంటంటే..
TOP 9 ET News: ప్రభాస్ ఉన్న ఆ 30 నిమిషాలు థియేటర్లో రచ్చ రచ్చే..
శ్రీలీల,రష్మిక ఉందిగా.. మళ్లీ తమన్నాను ఎందుకు? ఇచ్చిపడేసిన హీరోయిన్

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
