శ్రీలీల,రష్మిక ఉందిగా.. మళ్లీ తమన్నాను ఎందుకు? ఇచ్చిపడేసిన హీరోయిన్
కన్నడనాట మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమన్నా పై కన్నడిగులు విమర్శలు కురిపిస్తున్నారు. దానికి కారణం మైసూరు శాండల్ సోప్. ఇటీవలే కన్నడ ప్రభుత్వం మైసూరు శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను నియమించింది. దాంతో ఒక్కసారిగా కన్నడ ప్రజలు తమన్నాను విమర్శించడం మొదలు పెట్టారు.
కన్నడ ఇండస్ట్రీలో ఇంతమంది స్టార్స్ ఉంటే తమన్నాను కన్నడ సోప్ అయిన మైసూరు శాండల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు నియమించారు అంటూ ప్రభుత్వం పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దీనిపై స్పందించారు. తాజాగా యాక్టర్ రమ్య కూడా ఇదే విషయంగా షాకింగ్ అండ్ కాంట్రో కామెంట్స్ చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మైసూరు శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియాను రూ. 6.2 కోట్లతో రెండేళ్ల కాంట్రాక్టుతో నియమించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమన్నా నియామకాన్ని విమర్శించారు. తమన్నా ప్రచారం చేస్తే మాత్రం.. సబ్బును కొంటారా అంటూ సెటైర్ వేశారు. అంతేకాదు కర్ణాటక సంస్కృతి, గుర్తింపును ప్రతిబింబించే కన్నడ నటీమణులను ఎంచుకోవాలని కానీ తమన్నా లాంటి నార్త్ వాళ్లను ఎంచుకోవడం ఏంటని ఇండైరెక్ట్‌గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మైసూరు శాండల్ సబ్బు కేవలం ఉత్పత్తి కాదు, కర్ణాటక సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి ప్రతీక అని తన సోషల్ మీడియా పోస్ట్‌లో కోట్ చేశారు. ఈ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి తమన్నా కాకుండా.. కన్నడ నటీమణులు రష్మిక మందన్న, శ్రీలీలా వంటి వారిని తీసుకుంటే బాగుండేదని… కర్ణాటక సర్కార్‌కు సలహా ఇచ్చారు. అయితే ఈ బ్యూటీ చేసిన పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. కన్నడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా తొలి ముద్దు.. జీవితమంతా గుర్తు పెట్టుకుంటా..
గుడ్ న్యూస్.. రెట్రో OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!
ప్రభాస్ బోర్ అనుకున్నా కానీ.. వామ్మో..! రాజాసాబ్‌పై మాళవిక నాటీ కామెంట్స్

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
