Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!

అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!

Phani CH

|

Updated on: May 27, 2025 | 1:25 PM

గతేడాది దీపావళికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియా స్వామి ఈ బయోపిక్ ను తెరకెక్కించారు. ఆర్మీ మేజర్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ గా సాయి పల్లవి ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించింది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించాడు.

దేశ భక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ ఆడియెన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ఈ సినిమా…! అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఈ సినిమా ఛాన్స్ ఫస్ట్ మన టాలీవుడ్‌ హీరోకే వచ్చిందట. ఎస్ ! అమరన్ సినిమాలో కథానాయకుడిగా ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను అనుకున్నారట. దర్శకుడు రాజ్ కుమార్ పెరియా స్వామి అల్లు అర్జున్‌తోనే ఈ మూవీ చేయాలని భావించారట. కానీ అల్లు అర్జున్ అప్పటికే తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. కనీసం అపాయిట్మెంట్ దొరకడం కూడా డైరెక్టర్ రాజ్‌ కుమార్‌ పెరియా స్వామికి కష్టమైందట. దీంతో మరో ఛాయిస్ లేక ఈ సినిమా కోసం హీరో శివ కార్తీకేయన్ ను అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ పెరియా స్వామి. ఇక ఆ తర్వాత బన్నీ పుష్ప 2లో బిజీ కావడంతో నేరుగా శివకార్తికేయన్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారట. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. శివ కార్తికేయన్ హిస్టరీలోనే వన్‌ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా హిస్టరీకెక్కింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్ బోర్ అనుకున్నా కానీ.. వామ్మో..! రాజాసాబ్‌పై మాళవిక నాటీ కామెంట్స్