సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ?? వణుకుపుట్టించిన ఘటన
70 MM థియేటర్‌లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. పెద్ద స్క్రీన్‌పై అభిమాన హీరోల యాక్షన్, డ్యాన్స్, ఫైట్స్‌ను తనివితీరా చూస్తే తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హర్రర్ సినిమా చూడాలంటే చిన్న స్క్రీన్స్ మీద మజానే ఉండదు. పెద్ద స్క్రీన్స్‌మీద భయంకరమైన సీన్స్ చూసి తీరాల్సిందే. అదో అద్భుతమైన, ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇస్తుంది, కానీ అర్జెంటీనాలో ఒక మహిళకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
థియేటర్‌లో హర్రర్ సినిమా చూస్తుండగా అది భయటికొచ్చింది. ఫైనల్ డెస్టినేషన్ సినిమాను చూస్తూ హర్రర్ సీన్లలో మునిగిపోయింది. ఇంతలో జరిగిన అనూహ్య సంఘటను ఒక్కసారిగా షాక్‌కు గురయింది. సినిమాలోని హర్రర్ నిజ జీవితంలో జరిగినట్లుగా అనిపించిందని ఆ మహిళ వణికిపోయింది. అర్జెంటీనా లా ప్లాటాలోని సినిమా థియేటర్‌లో ఈ సంఘటన జరిగింది. సినిమాలో ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌కు చేరుకుంటుండగా, సినిమా హాల్ పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. కింద ఉన్న సీట్ల మీద అమాంతం పడిపోయింది. ఈ ఘటనలో ప్రేక్షకుడికి గాయాలయ్యాయి. ఫియమ్మ విల్లావర్డేగా గుర్తించబడిన ఆ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెను, వారి స్నేహితుడితో కలిసి థియేటర్‌కు వెళ్ళింది. సినిమా ప్రారంభమైన కాసేపటికే థియేటర్ పైకప్పు కూలిపోయింది. సినిమాలోని ఉత్కంఠభరితమైన, బిగ్గరగా ఉండే సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు పైకప్పు కూలిపోయింది. అయితే ఉరుములాంటి శబ్దం కొనసాగుతున్న సన్నివేశం నుండే వచ్చిందని అంతా భావించారు. “మొదట, మేము సినిమాలో చాలా మునిగిపోయాము కాబట్టి ఇది సినిమాలో భాగమని అనుకున్నాము” అని ఫియామ్మ తెలిపింది. కానీ తరువాత ఒక పెద్ద ముక్క తనపై పడటంతో సినిమా కాదు రియల్‌గా జరిగిందనే విషయం తెలిసిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే పైకప్పు నుండి ఒక ప్యానెల్ పడి ఆమె మోకాలికి గాయమైంది. వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయం కారణంగా ఆమె ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వచ్చిందిని ఫియమ్మ వాపోయింది. ఘటనపై న్యాయవాదిని సంప్రదించినట్లు ఆమె చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు విష్ణుకు బిగ్ షాక్ ‘కన్నప్ప’ సినిమా హార్డ్‌డిస్క్ చోరీ..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

