Superstar Krishna: కృష్ణ మృతితో శోక సంద్రంలో టాలీవుడ్‌.. కాంటినెంటల్‌ హాస్పిటల్‌కు సినీ ప్రముఖులు

కృష్ణ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కృష్ణ త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్ధనలు ఫలించలేదు. చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారు జామున 4 గంటలకు మృతి చెందారు.

Superstar Krishna: కృష్ణ మృతితో శోక సంద్రంలో టాలీవుడ్‌.. కాంటినెంటల్‌ హాస్పిటల్‌కు సినీ ప్రముఖులు
1

Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2022 | 10:23 AM

ఒకనాటి యువతుల కలల చెలికాడు. యువతరం మదిని మీటిన మొనగాడు…ప్రజాస్వామ్య విలువలతో వెండితెరను ప్రభావితం చేసిన నటరాజు సూపర్‌ స్టార్‌ క్రిష్ణ యావత్‌ తెలుగు ప్రేక్షక లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి దివికేగి ఆకసంలో తారగా నిలిచాడు. కార్డియాక్‌ ఆరెస్ట్‌తో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచారు. తెలుగు తెరను సుదీర్ఘకాలం శాసించిన సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది.