Navdeep: గండిపేటలో నవదీప్.. పోలీసులకు ఫోన్
మాదాపూర్ డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో అలజడి రేపింది. డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి బయటికి వచ్చాయి. డైరెక్టర్ సుశాంత్‌రెడ్డిని అరెస్ట్ చేశాం.. నవదీప్, ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి పరారీలో ఉన్నారని తెలిపారు సీపీ. అయితే సీపీ ఆనంద్ ప్రెస్‌మీట్‌లో నవదీప్ అని చెప్పగానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌నకు సంబంధం ఉందని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో హీరో నవదీప్ స్పందించారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో అలజడి రేపింది. డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి బయటికి వచ్చాయి. డైరెక్టర్ సుశాంత్‌రెడ్డిని అరెస్ట్ చేశాం.. నవదీప్, ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి పరారీలో ఉన్నారని తెలిపారు సీపీ. అయితే సీపీ ఆనంద్ ప్రెస్‌మీట్‌లో నవదీప్ అని చెప్పగానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌నకు సంబంధం ఉందని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో హీరో నవదీప్ స్పందించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని టీవీ9 క్లారిటీ ఇచ్చారు. అలాగే ట్విటర్ ఎక్స్‌లో కూడా రెస్పాండ్ అయ్యారు. మరోవైపు నవదీప్ తో కలిసి తాను డ్రగ్స్ పార్టీని నిర్వహించడంతోపాటు తాము డ్రగ్స్ ని స్వీకరించామని రామ్ చందర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో నవదీప్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. నవదీప్ కొసం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. తాను గండిపేట్ లో ఉన్నానని పోలీసులకి నవదీప్ బదులిచ్చాడు. అయినా కూడా.. ప్రస్తుతం నవదీప్ ఇంకా పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. నవదీప్ తో పాటు మరో ఎనిమిది మంది డ్రగ్ కన్జ్యూమర్లు పరారీలో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Scrub Typhus: దేశంలో మరో కొత్త జ్వరం ఎంట్రీ.. ఒకరు మృతి
దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్-1.. నాలుగోసారి కక్ష్య పెంపు విజయవంతం
కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంపై 8 శివాలయాలు