Adipurush – Manoj Muntashir: దేవునిపై.. బలుపు మాటలా.. ఆదిపురుష్ రైటర్‌కు వార్నింగ్..!

|

Jun 22, 2023 | 9:36 AM

ఓ పక్క ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ... రామాయణాన్ని వక్రీకరించారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న వేళ...ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్‌ ముంతషిర్.. మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా గొప్ప రామభక్తుడైన హనుమాన్ పైనే షాకింగ్ కాంమెంట్స్ చేశారు.

ఓ పక్క ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ… రామాయణాన్ని వక్రీకరించారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న వేళ…ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్‌ ముంతషిర్.. మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా గొప్ప రామభక్తుడైన హనుమాన్ పైనే షాకింగ్ కాంమెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌ తోనే… హిందుత్వ సంఘాలతో పాటు.. హనుమాన్ భక్తులను కూడా.. సీరియస్ అయ్యేలా చేశారు. ఎస్ ! బాలీవుడ్లో స్టార్ డైలాగ్‌ రైటర్ అండ్ లిరిసిస్ట్ అయిన మనోజ్ ముంతాషిర్‌.. ఆదిపురుష్ సినిమాకు డైలాగ్స్ అందించారు. ఆ సినిమాలో హనుమాన్‌… రావణాసురిడి కొడుకు మధ్య సాగే ఓ డైలాగ్‌తో.. తీవ్ర విమర్శల పాలు కూడా అయ్యారు. ఇక ఆ డైలాగ్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి.. ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో చేసేందేం లేక..ఆ డైలాగ్‌ను సినిమా నుంచి తీసేసే వరకు తెచ్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఈ వివాదంపై ఓ నేషనల్ ఛానెల్లో మాట్లాడిన మనోజ్ ముంతాషిర్.. హనుమాన్ దేవుడే కాదంటూ.. షాకింగ్ కామెంట్స్‌ చేశారు. హనుమంతుడు దేవుడు కాదు. ఆయనొక భక్తుడన్న ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్‌.. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయన్ను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. అయితే మనోజ్‌ చేసిన ఈ డైలాగ్స్‌ పై తాజాగా హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి. వారితో పాటు హనుమాన్ భక్తులు.. నెటిజెన్లు కూడా… ఈయన కామెంట్స్ పై విరుచుకుపడుతున్నారు. బలుపు మాటలు మానుకో అంటూ.. ఈ స్టార్ డైలాగ్‌ రైటర్ ను వార్న్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!