Krishnam Raju: ‘మర్యాద రామన్న’గా మారడం వెనుక దెబ్బతగిలిన బాధుంది ఆయనలో…
ఇండస్ట్రీలో మర్యాద రామన్న ఎవరంటే.. కృష్ణం రాజునే చూపిస్తారు. చూపించడం ఏంటి.. ? కృష్ణం రాజు మారు పేరునే మర్యాద రామన్న గా మార్చేశారు. తన ఇంటికి వచ్చిన ఎవరైనా..
ఇండస్ట్రీలో మర్యాద రామన్న ఎవరంటే.. కృష్ణం రాజునే చూపిస్తారు. చూపించడం ఏంటి.. ? కృష్ణం రాజు మారు పేరునే మర్యాద రామన్న గా మార్చేశారు. తన ఇంటికి వచ్చిన ఎవరైనా.. విందు భోజనం చేయించి గాని పంపించరు ఈ రాజు. ఇంటికి వచ్చిన వారు మాత్రమే కాదు.. తనకు నచ్చిన.. తనను మెచ్చిన.. వారందరికీ.. తన మర్యాదలను రుచి చూపిస్తారు. వారందంరిచేత ‘రాజువయ్యా నువ్వు’ అని అనిపించుకుంటూనే ఉంటారు. అయితే కృష్ణం ఇలా మారడానికి తన జీవితంలో తనకు ఎదరైన ఓ చేదు సంఘటనే కారణం అని చాలా సందర్భాల్లో చెప్పారు మన రెబల్ స్టార్. కృష్ణంరాజు తన చిన్నతనంలో.. ఓ సారి ఓ పెద్దాయన ఇంటికి వస్తే ఆయన ముందు కాళ్ళు జాపుకుని తాపీగా కూర్చున్నారట. ఆ పెద్దాయన వెళ్లేంత వరకు కూడా కృష్ణం రాజు అలానే కుర్చున్నారట. దాంతో కృష్ణంరాజు నాన్నగారు కొరడాను తెప్పించి మరీ .. చితక్కొట్టి అలా కూర్చోవద్దు అంటూ చెప్పారట. అంతేకాదు ఇంటికి ఎవరు వచ్చినా ముందు అతిథి మర్యాదలు చేయాలని.. నువ్వు ఏపనిలో ఉన్నా ఇంటికివచ్చిన వారిని ముందు గౌరవించాలని చెప్పారట. అప్పటి నుంచి కృష్ణంరాజు.. తన ఇంటికి ఎవరొచ్చినా మర్యాదలు చేయడం అలవాటు చేసుకున్నారు. అదే అలవాటును తన అబ్బాయి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు కూడా అలవాటు చేశారట కృష్ణం రాజు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krishnam Raju Death: చస్తే అలానే చావాలి !! ఏడిపిస్తున్న కృష్ణం రాజు మాటలు !!
Prabhas: కృష్ణం రాజు మరణంతో ఆ బాధ్యత ఇక ప్రభాస్‌దే
Krishnam Raju: ఆ విషయంలో ఇప్పటికీ కృష్ణం రాజుదే నెంబర్ 1 రికార్డు
Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
TOP 9 ET News: పార్టీలో హంగామా చేసిన బన్నీ.. అవన్నీ ఫేక్ కలెక్షన్సా ??
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

