కీర్తి సురేశ్ దోసె వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌

Updated on: Apr 08, 2025 | 6:05 PM

‘మహానటి’ సినిమాలో సావిత్రిని మరిపించిన కీర్తి సురేశ్‌.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తోంది. ఆమెకు నచ్చిన దోశ డిష్‌కి సంబంధించిన పాట తాజాగా నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే ఆ పాటను 1.3 కోట్ల మంది చూసారు. తాజాగా ఆ పాటను ఓ కొరియన్‌ మహిళ రీక్రియేట్ చేసిన తీరు హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఏంటా సాంగ్‌? ఎందుకంత పాపులర్‌గా మారింది? ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో కీర్తికి తనకిష్టమైన ఫుడ్‌ ఏంటి అన్న ప్రశ్న ఎదురైంది.

‘ఇడ్లీ/దోసె, పరాటా/దోసె, బిరియానీ/దోసె, పుట్టు/దోసె..’ ఇలా ఈ నాలుగు ఆప్షన్లలో దోసెను ఎంచుకుంది కీర్తి. అదే తన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ అని నవ్వుతూ సమాధానమిచ్చిందీ బ్యూటీ. ఇదే వీడియో చూసిన సంగీత దర్శకుడు యశ్‌రాజ్ బుర్రకు ఓ మెరుపు లాంటి ఆలోచన తట్టింది. అప్పటికే ‘రసాడో మే కౌన్ థా’, ‘లప్పూ సా సచిన్ అండ్ ఆజ్‌ తో సండే’ వంటి రీమిక్స్ పాటలతో పాపులర్ అయిన అతడు ‘దోసె’ పేరుతో హిందీలో ఓ ట్యూన్ కట్టాడు. కీర్తి మాటలకు తన పాటను జోడిస్తూ ఓ అందమైన సాంగ్‌కు రూపమిచ్చాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. ఇదే వీడియో తాజాగా కీర్తి కంట పడింది. ‘ఓ మై గాడ్.. ఇది చాలా ఫన్నీగా, కూల్‌గా ఉంది! ఇది నా కొత్త ఫేవరెట్ పాట అయ్యేలా ఉందంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ఇలా కీర్తికి దోసే కాదు.. దోసె పాట కూడా తెగ నచ్చేసింది! ఇప్పుడీ పాట ఢిల్లీలో ఉంటున్న కొరియా మహిళకి తెగ నచ్చేసి వీడియోను రీక్రియేట్ చేసింది. కీర్తి సురేష్‌ దోసె అన్న చోట తను కూడా దోసె అంటూ పలికింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??

వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా

పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..

నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??

బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి

Published on: Apr 08, 2025 05:46 PM