యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. కానీ కల్కి, పుష్ప 2 లనే బీట్ చేసింది!
కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో అలరిస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల హృదయానికి హత్తుకుంటాయి.. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ అంటూ రచ్చ లేదు..
డబుల్ మీనింగ్ డైలాగ్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లేవు ఆ మాటకొస్తే పెద్ద కథ కూడా కాదు.. కానీ ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా..? అదే.. సైలెంట్‌గా వచ్చి, ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న సత్యం సుందరం సినిమా! ఇదొక ఎమోషనల్ డ్రామా సినిమా. ఇప్పుడీ సినిమా ఏకంగా ఓ ఘనత సాధించింది. ఏకంగా అల్లు అర్జున్ పుష్ప2, ప్రభాస్ కల్కి సినిమాలనే బీట్ చేసింది. గత ఏడాది అంటే 2024లో చాలా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలానే ఉన్నాయి. పుష్ప 2, కల్కి 2898 AD లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా థియేటర్స్‌లోకి వచ్చాయి. అయితే ఆ సినిమాలు ఏవీ అందుకోలేని ఓ రికార్డ్ ను సత్యం సుందరం సినిమా అందుకుంది. తమిళ్లో మేయషఘమ్ పేరుతో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా.. తమిళ తంబీల మనసులను గెలుచుకుంది. అలా తెలుగుతో సత్యం సుందరం పేరుతో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా.. తెలుగు వాళ్లను ఆకట్టుకుంది. సింపుల్ కథ.. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపించింది. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈ సినిమాకు ‘96’ లాంటి ఎమోషనల్ హిట్‌ను అందించిన సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా 8.4 రేటింగ్ సాధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే

