సన్యాసినిగా మారిన టాలీవుడ్ హీరోయిన్
సోనియా బన్సాల్! హిందీతో పాటు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. అంతేకాదు ఆమె ఇకపై ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కూడా స్పష్టం చేసి.. తన నిర్ణయంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఈమె.
ఇక ఉత్తర ప్రదేశ్ కు చెందిన సోనియా బన్సాల్ హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. గేమ్ హండ్రెడ్ క్రోర్ కా అనే మూవీతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాటీ గ్యాంగ్, డుబ్కీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెజీనా ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ శూర్‌వీర్‌లో సోనియా నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో అదరగొట్టింది. ఇక ధీర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సోనియా. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కుమారుడు లక్ష్య్ పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ.. సన్యాసిగా మారుతున్నట్టు అనౌన్స్ చేసింది. సినిమాల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. కానీ కల్కి, పుష్ప 2 లనే బీట్ చేసింది!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

