Karate Kalyani: అలాంటి వాడిని వదలొద్దు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..

| Edited By: Phani CH

Sep 18, 2024 | 4:58 PM

హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుచ్చెర్య అంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యానించారు. ఇది లవ్ జిహాదేనని.. పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్ మతమార్పిడులను వ్యతిరేకించి ఒక అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణమని అన్నారు. జానీ మాస్టర్ ఒక పెద్ద డాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా ఒక పార్టీ నేత అయినంత మాత్రాన..

హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుచ్చెర్య అంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యానించారు. ఇది లవ్ జిహాదేనని.. పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్ మతమార్పిడులను వ్యతిరేకించి ఒక అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణమని అన్నారు. జానీ మాస్టర్ ఒక పెద్ద డాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా ఒక పార్టీ నేత అయినంత మాత్రాన ఆయనకు మద్దతుగా ఉండాల్సిన పనిలేదని కరాటే కళ్యాణి అన్నారు. బాధిత అమ్మాయి చెప్పిన ఇబ్బందుల తీరు చూస్తే దారుణంగా ఉందన్న కళ్యాణి.. బాధితురాలికి అందరూ అండగా ఉండాలని చెప్పారు. జానీ మాస్టర్ ఆ అమ్మాయిని పెట్టిన ఇబ్బందులు.. ఆ అమ్మాయి చెబుతున్న తీరును సమాజం అర్థం చేసుకొని అందరూ బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అండగా ఉండాలని.. తాను ఆ బాధితురాలికి మద్దతు ప్రకటిస్తున్నట్టు కరాటే కల్యాణి వెల్లడించారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా అందరూ ఫైట్ చేయాలని.. మత మార్పిలను ఏమాత్రం ప్రోత్సహించకుండా ఇలాంటి వాటి పట్ల రేవంత్ సర్కార్ కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసినట్లు తేలితే వెంటనే జానీ మాస్టర్ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలో ఏదైనా రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా ఎంక్వయిరీ చేయాలంటూ కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కళ్యాణి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??

ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే

క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు

చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది

Follow us on