Jr.NTR: కోనసీమలో ఆలయానికి జూ.ఎన్టీఆర్‌ భారీ విరాళం

ఏదైనా విపత్తు సంభవించినప్పడు ఆపన్నులను ఆదుకోవడంలో సినీ ఇండస్ట్రీ ముందు ఉంటుంది. అంతేకాదు ఆలయ నిర్మాణాల్లోనూ భాగస్వాములవుతారు. కొందరు బహిరంగంగా ప్రకటిస్తే కొందరు గుప్తంగా విరాళాలు ఇస్తుంటారు. కానీ ఏదొక సందర్భంలో అవి బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ మారుమూల గ్రామంలోని ఆలయ నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చారు జూనియర్‌ ఎన్టీఆర్‌. తాజాగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది.

Jr.NTR: కోనసీమలో ఆలయానికి జూ.ఎన్టీఆర్‌ భారీ విరాళం

|

Updated on: May 22, 2024 | 9:47 PM

ఏదైనా విపత్తు సంభవించినప్పడు ఆపన్నులను ఆదుకోవడంలో సినీ ఇండస్ట్రీ ముందు ఉంటుంది. అంతేకాదు ఆలయ నిర్మాణాల్లోనూ భాగస్వాములవుతారు. కొందరు బహిరంగంగా ప్రకటిస్తే కొందరు గుప్తంగా విరాళాలు ఇస్తుంటారు. కానీ ఏదొక సందర్భంలో అవి బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ మారుమూల గ్రామంలోని ఆలయ నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చారు జూనియర్‌ ఎన్టీఆర్‌. తాజాగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జగ్గన్నపేట దగ్గర ఉన్న మొగలికుదురు గ్రామంలో బ్రిటిష్ కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం ఉంది. అది శిథిలావస్థకు చేరడంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని స్థానికులు భావించారు. అయితే ఆలయ పునర్నిర్మాణంలో ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ భాగస్వాములయ్యారు. దాదాపు 12,50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. మొగలికుదురు గ్రామానికీ చెందిన పురోహితులు కారుపర్తి కోటేశ్వరరావు Jr. ఎన్టీఆర్ వివాహం జరిపించారు. అంతేకాదు NTR గృహ వాస్తు సిద్ధాంతి కూడా ఆయనే. అయితే కారుపర్తి కోటేశ్వరరావు సిద్ధాంతి తమ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం పరిస్థితిని Jr NTR తల్లి షాలినికి తెలపడంతో ఆలయం పునర్ నిర్మాణానికి 12 లక్షల 50 వేలు విరాళం ప్రకటించారు ఎన్టీఆర్‌. మూడేళ్ళ క్రితం ఆలయం నిర్మాణం పూర్తయినా రెండు మూడు రోజులు క్రితం శిలాఫలకం ఏర్పాటు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ విరాళం ఇచ్చిన విషయం వెలుగు చూసింది. శిథిలావస్థలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి Jr NTR చేసిన సహాయాన్ని గ్రామస్తులు కొనియాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతుల పేర్లను శిలాఫలకం మీద వేసి ఆలయం బయట ప్రతిష్టించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Driving License: ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటే.. అక్కడే లైసెన్స్.. జూన్ 1 నుంచే అమల్లోకి

ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్‌ గా ఇచ్చిన ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌

తెల్ల ఉల్లిపాయలు కనిపిస్తే వదలకండి.. దాని ప్రయోజనాలు తెలిస్తే షాకే

రోడ్డు పక్కన స్నాక్స్‌ తింటున్న అమ్మాయిలు.. అంతలోనే..

నాన్‌వెజ్‌ జాతర.. తిన్నవారికి తిన్నంత.. కానీ, లేడీస్ కు నో ఎంట్రీ

Follow us