Vishal, Abhinaya in love: మరో హీరోయిన్‌ ప్రేమలో విశాల్‌.. త్వరలో పెళ్లి..? క్లారిటీ వీడియో.

|

Nov 04, 2022 | 9:01 PM

విశాల్‌.. సినిమాలు, పాలిటిక్స్‌తోనే కాదు నిత్యం పెళ్లి పుకార్లతోనూ వార్తల్లో ఉంటారు. గతంలో ఎన్నోసార్లు ఈ హీరో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ముందు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది.


విశాల్‌.. సినిమాలు, పాలిటిక్స్‌తోనే కాదు నిత్యం పెళ్లి పుకార్లతోనూ వార్తల్లో ఉంటారు. గతంలో ఎన్నోసార్లు ఈ హీరో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ముందు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది. పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన యువతితో విశాల్‌ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే పెళ్లిపీటలెక్కకుండానే అది క్యాన్సిల్‌ అయిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అభినయ, విశాల్‌ హీరోగా నటిస్తున్న మార్క్‌ ఆంటోనీ చిత్రంలో లీడ్‌రోల్‌ పోషిస్తోంది. ఈనేపథ్యంలో విశాల్‌తో ప్రేమ, పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారంపై విశాల్‌ ఇప్పటివరకు స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం రియాక్ట్‌ అయ్యింది. ‘మార్క్‌ ఆంటోనీ సినిమాలో విశాల్‌కు భార్యగా నటిస్తున్నాను. రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా?’ అంటూ ఈ పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విశాల్‌, అభినయల ప్రేమ, పెళ్లి అనే పుకార్లకు పుల్‌స్టాప్‌ పడినట్టు అయింది. ఇక విశాల్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను లాఠీ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 04, 2022 09:01 PM