AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambajipeta Marriage Band Review: హిట్టా..? ఫట్టా..? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గట్టిగా మోగినట్టేనా.?

Ambajipeta Marriage Band Review: హిట్టా..? ఫట్టా..? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గట్టిగా మోగినట్టేనా.?

Anil kumar poka
|

Updated on: Feb 03, 2024 | 7:47 PM

Share

ట్యాలెంటెడ్ యాక్టర్ అనే ట్యాగ్ ఉంది. పర్ఫార్మన్‌ గా సూపర్ డూపర్ గుర్తింపు ఉంది. పేరుకు తగ్గట్టే రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా.. చాలా..చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందకే అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. లెట్స్ సీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ..

ట్యాలెంటెడ్ యాక్టర్ అనే ట్యాగ్ ఉంది. పర్ఫార్మన్‌ గా సూపర్ డూపర్ గుర్తింపు ఉంది. పేరుకు తగ్గట్టే రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా.. చాలా..చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందకే అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. లెట్స్ సీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ.. కథలోని వెళితే.. అంబాజీపేటలో మల్లి అలియాస్ సుహాస్ అండ్ అతని గ్యాంగ్.. బ్యాండ్ వాయిస్తూ కులవృత్తి అయిన కటింగ్, షేవింగ్ చేస్తుంటారు. మల్లికి అక్క పద్మ అలియాస్ శరణ్య ప్రదీప్ ఉంటుంది. ఆమెకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. పైగా చదువుకున్న అమ్మాయి. ఆ ఊరిలోనే టీచరుగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. మరోవైపు అదే ఊళ్లో అనేక వ్యాపారాలతో పాటు వడ్డీ వ్యాపారం చేసే వెంకట్ బాబు అలియాస్ నితిన్ ప్రసన్న.. పద్మకు ఉద్యోగం పెర్మనెంట్ చేయించడంతో ఆ ఇద్దరి మీద ఊళ్లో పుకార్లు పుట్టిస్తారు. ఇద్దరికీ అక్రమ సంబంధం ఉంది అంటారు. అదే సమయంలో వెంకట్ తమ్ముడు తో ఇటు మల్లి, అటు అతని అక్క పద్మ ఇద్దరు వేర్వేరు విషయాల్లో గొడవపడతారు. మరోవైపు చిన్నప్పటి నుంచి వెంకట్ చెల్లెలు లక్ష్మి అలియాస్‌ శివానితో ప్రేమలో ఉంటాడు మల్లి. ఈ విషయం తెలియడంతో అటు పద్మకి, ఇటు మల్లికి కలిసి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంకట్ భావిస్తూ ఉంటాడు. ఓ రాత్రి సమయంలో పద్మను ఒంటరిగా స్కూల్ కి పిలిపించి దారుణంగా అవమానిస్తాడు. అక్కకు జరిగిన అవమానం తట్టుకోలేక వెంకట్ పైకి వెళ్ళిన మల్లికి గుండు కొట్టిస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఆత్మాభిమానం కాపాడుకోవడానికి అక్క తమ్ముళ్లు ఏం చేశారు అనేదే రిమైనింగ్ స్టోరీ.

ఇదేం తెలియని కథ కాదు.. మనం ఊర్లలో రెగ్యులర్ గా చూసే కథే. అగ్రకులాలు, తక్కువ జాతి అంటూ జరిగే గొడవలనే సినిమాగా తీసాడు దుశ్యంత్. చిన్న కథలోనే ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా బాగా రాసుకున్నాడు. అంతకంటే బలమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి సినిమాలో. ఫస్టాఫ్ అంతా లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ తో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కథ ఇంకో మలుపు తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ తోనే సాగుతుంది. అందులోనూ పోలీస్ స్టేషన్ సీన్ అదిరిపోయింది.. ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా సహజంగా తీసినట్టే అనిపిస్తుంది. ఇదే ఈ సినిమాకు ప్లస్సు కూడా అయింది.

ఇక సుహాస్ మరోసారి అదరగొట్టాడు.. క్యారెక్టర్ కి ప్రాణం పోసాడు. హీరోయిన్ శివాని ఉన్నంతలో బాగా చేసింది. కానీ ఈ సినిమాకు మెయిన్ హీరో శరణ్య. ఆమె మాత్రం తన యాక్టింగ్‌తో.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేస్తుంది. పుష్ప ఫేమ్ జగదీష్ బండారికి మంచి రోల్ పడింది. విలన్ గా నితిన్ ప్రసన్న కూడా బాగా చేసాడు. వీరికి తోడు శేఖర్ చంద్ర సంగీతం సూపర్. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. సినిమాటోగ్రాఫర్ వాజిత్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక ఓవర్‌ ఆల్‌గా… ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఇదో హార్డ్‌ హిట్టింగ్ సినిమా..!చూడాల్సిన సినిమా..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos