Sandeep Reddy Vanga: ‘నీ భర్తను వెళ్లి అడుగు’ అమీర్ మాజీ భార్యకు ఇచ్చిన పడేసిన సందీప్ రెడ్డి.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ కొంతమంది సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుపిస్తున్నారు. ఈ మూవీలో వయోలెన్స్, స్త్రీ పట్ల ద్వేషాన్ని..వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ కొంతమంది సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుపిస్తున్నారు. ఈ మూవీలో వయోలెన్స్, స్త్రీ పట్ల ద్వేషాన్ని..వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా స్త్రీ విద్వేష చిత్రమని చాలా మంది ప్రముఖులు మండిపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా అదే చేశారు. దీంతో.. ఈమె కామెంట్స్‌పై తాజాగా కాస్త సీరియస్‌గా రియాక్టయ్యారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రావు.. బాహుబలి 2, కబీర్ సినిమాలు కూడా స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కామెంట్స్ చేశారు. ఇక యానిమల్ సినిమా అంతకు మించి ఉన్నట్టు చెప్పారు. అవి కాస్తా బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవడంతో.. ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రియాక్టయ్యారు. ఇంతకీ సందీప్ రెడ్డి వంగా రిప్లై ఏంటంటే.! “కొంతమంది ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
బాహుబలి 2, కబీర్ సింగ్ సినిమాలు స్త్రీ పట్ల ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఓ సూపర్ స్టార్ రెండవ భార్య చేసిన కామెంట్స్ నా అసిస్టెంట్ డైరెక్టర్ నాకు చూపించారు. వెంబడించడం, సమీపించడం మధ్య తేడా ఆమెకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. నేను ఆమెకు ‘ఖాంబే జైసీ ఖాదీ హై’ పాట గురించి అడగాలనుకుంటున్నాను. మీరు దిల్ సినిమాను చూశారా ?. అందులో అమ్మాయి పై రేప్ కు ప్రయత్నించే పరిస్థితి సృష్టిస్తాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతడితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏంటీ ?.. ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో నాకు అర్థం కావడం లేదు” అంటూ.. అమీర్ మాజా భార్యకు ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చిపడేశారు సందీప్ రెడ్డి వంగా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos