Hai Nanna Review: క్లాసిక్ టచ్ ఇచ్చిన నాని హాయ్ నాన్న.. హిట్టా.? ఫట్టా.?
క్లాసు మాసు అని తేడా లేకుండా.. సినిమాలు చేసుకుందటూ పోతున్న నాని... తాజాగా హాయ్ నాన్న సినిమాతో మన ముందుకు వచ్చారు. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమాతో అందర్నీ ఎమోషనల్గా టచ్ చేస్తా అంటూ.. కొన్ని రోజుల ముందు నుంచే చెబుతూ వస్తున్నాడు. మరి నాని చెప్పినట్టే చేశాడా? అసలు హాయ్ నాన్న ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే... వాచ్ దిస్ ఫుల్ రివ్యూ..!
ఇక కథలోకి వెళితే… విరాజ్ అలియాస్ నాని ముంబైలో ఫేమస్ ఫోటోగ్రఫర్. తన కూతురు మహి అలియాస్ కియారా ఖన్నా, మామయ్య అలియాస్ జయరాంతో కలిసి ఉంటాడు. కూతురు అంటే విరాజ్‌కు ప్రాణం. పుట్టినప్పటి నుంచే అరుదైన వ్యాధితో పోరాడుతుంటుంది మహి. కంటికి పాపలా కూతురును చూసుకుంటుంటాడు విరాజ్. అయితే రోజూ అమ్మ కథ చెప్పాలని అడుగుతూ ఉంటుంది మహి. కానీ విరాజ్ మాత్రం అమ్మ కథ చెప్పడు. ఒకరోజు ఇంట్లోంచి వెళ్లిపోయిన మహిని అనుకోని ప్రమాదం నుంచి కాపాడుతుంది యష్ణ అలియాస్ మృణాళ్ ఠాకూర్. ఓ కాఫీ షాప్‌లో మహితో కలిసి చాలా క్లోజ్ అయిపోతుంది యష్ణ. కచ్చితంగా అమ్మ కథ చెప్తే కానీ ఇంటికి రాను అంటుంది మహి. అప్పుడు తన కథ చెప్తాడు విరాజ్. ఈసారి తండ్రి చెప్పే కథలో తన అమ్మ వర్ష పాత్రని యష్ణలో ఊహించుకుంటుంది మహి. అసలు వర్ష ఎవరు.. ఎందుకు విరాజ్ జీవితం నుంచి వెళ్లిపోయింది.. ఆ తర్వాత ఏమైంది.. యష్ణ, మహి ఎందుకు అంతగా కనెక్ట్ అయిపోతారు అనేది అసలు కథ.. ఇక సినిమా మొదలవ్వగానే 15 నిమిషాలు ఒకరకమైన ట్రాన్స్‌లోనే ఉండిపోతారు ప్రేక్షకులు. కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ భారంగా మారింది.. అసలేం ఉందని నాని ఈ కథ ఒప్పుకున్నాడో అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా మంది ప్రేక్షకులకు ఇదే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇంటర్వెల్ కార్డ్ పడినప్పటి నుంచి ఒపీనియన్ మారిపోతుంది. ఫస్టాఫ్ లో కనిపించిన లోపాలన్నీ సెకండాఫ్ లో మాయం అయ్యాయి. అక్కడ మిస్ అయిన ఎమోషన్స్ ఇక్కడ పడ్డాయి.. పండాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెకండాఫ్ రైటింగ్ అద్భుతంగా ఉంది.
నాని, పాప మధ్య సీన్స్.. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ ఇలా అన్నీ హైలీ ఎమోషనల్. అక్కడ కంటతడి పెట్టకుండా ఉండలేం అంటే అతిశయోక్తి కాదేమో..? ముఖ్యంగా పాప నటించిన తీరుకు కన్నీరు తప్పదు. ముఖ్యంగా సింపుల్ కథను చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శౌర్యువ్. ప్రెడిక్టబుల్ కథ, కథనాలే ఉంటాయి. కానీ టేకింగ్ వరకు మాత్రం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సింపుల్ సన్నివేశాలనే నాని, మృణాళ్ తమ నటనతో సినిమాను పతాక స్థాయికి చేర్చేసారు. నాని ఎప్పటిలాగే ఈ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టు అనిపించింది. భర్తగా రొటీన్ అనిపించినా.. నాన్న పాత్ర దగ్గరికి వచ్చేసరికి మాత్రం కళ్లతోనే ఏడిపించేసాడు నాని. ఇక కూతురుగా నటించిన కియార ఖన్నా చివర్లో ఏడిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ అన్నీ అద్భుతంగా నటించింది కియారా. మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శ్రుతి హాసన్ ఎందుకు ఉందో ఆమెకు కూడా తెలియదు. జయరాం పర్లేదు.. క్లైమాక్స్‌లో ఆయన కారెక్టర్ పండింది. ప్రియదర్శి సినిమా అంతా హీరో ఫ్రెండ్‌గా బాగున్నాడు. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ మరికొందరు తమ తమ పాత్రల్లో బాగా నటించారు. వీరికి తోడు హేషమ్ పాటలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కాస్త స్లో అయింది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. హాయ్ నాన్న.. ఫస్టాఫ్ జస్ట్ ఓకే.. సెకండాఫ్ ఏడిపించావ్ నాన్న..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

