Naga Chaitanya: N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
భాగ్యనగరంలో చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ అక్రమ బిల్డింగులను కూల్చివేస్తోంది. ఇటీవలే మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా బృందం కూల్చివేసింది. దీనిపై ఇప్పటికే నాగార్జున రియాక్ట్ అయ్యారు. తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని.. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
భాగ్యనగరంలో చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ అక్రమ బిల్డింగులను కూల్చివేస్తోంది. ఇటీవలే మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా బృందం కూల్చివేసింది. దీనిపై ఇప్పటికే నాగార్జున రియాక్ట్ అయ్యారు. తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని.. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ ఎన్ కన్వెషన్ సెంటర్ కు సంబంధించిన వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని.. ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మవద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇక తాజాగా నాగార్జునతో పాటే.. ఆయన తనయుడు నాగ చైతన్య కూడా.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై రియాక్టయ్యారు.
తాజాగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన నాగ చైతన్యను మీడియా ఈ విషయంపై అడగగా ఆన్సర్ ఇచ్చారు. ఆ విషయం ఇప్పుడు వద్దని.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి అన్ని వివరాలను నాన్న ట్విట్టర్ వేదికగా చెప్పారు కదా అని అన్నారు.
ఇక మరో రిపోర్టర్ మీ పెళ్లి ఎక్కడ జరుగుతుందంటూ ప్రశించగా… ఇంకా ఏం నిర్ణయించలేదని అన్నారు. ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో త్వరలోనే అందరికీ తెలుస్తాయని క్లారిటీ ఇచ్చారు. అలాగే మంచి కథ ఉంటే శోభిత, తాను కలిసి నటిస్తామని చెప్పారు చై. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారని అడగ్గా.. తనను ఎక్కువగా చూపిస్తున్నారని చెప్పి అక్కడున్న వారందర్నీ నవ్వించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.