Naga Chaitanya-Sobhita: పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
ఇప్పుడంటే.. అంతా షాట్ కట్ అయిపోయింది కానీ.. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే.. చాలా రోజుల పాటు జరిగేవి. ఒక్క తాళి కట్టే ఘట్టమే చాలా గంటలు సాగేది.. అయితే ఇప్పుడు అదే సంప్రదాయాన్ని మరో సారి అందరికీ గుర్తు చేయనున్నాడు నాగచైతన్య. సంప్రదాయ బద్దంగా.. డిసెంబర్ 4న శోభిత మెడలో తాను తాళి కట్టబోతున్నాడు. అయితే ఈ క్రమంలోనే వీరి పెళ్లి వేడుక గురించి ఇప్పుడో న్యూస్ బయటికి వచ్చింది.
ఇక చై- శోభిత పెళ్లి డేట్ దగ్గర పడుతోంది. ఇప్పటికే వివాహ వేడుకని అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నాగార్జున. అయితే ఈ క్రమంలోనే ఈ జంట ఎనిమిది గంటలు వివాహ వేడుకకు సిద్ధమవుతున్నారని ఓ వార్త వినిపిస్తోంది. తెలుగు బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ క్రతువుకి 8 గంటలకు పైగా సమయం పడుతుందని.. దీంతో ఈ వివాహ వేడుకలు సుదీర్ఘ సమయం జరగబోతున్నాయని శోభిత సన్నిహిత వర్గాలు బయట చెప్పాయని టాక్.
చైతన్య శోభితల పెళ్ళికి సుముహర్తం 4వ తేదీ రాత్రి 8.13 గంటలు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం జరగనుంది. వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇక శోభిత నిజమైన బంగారు జరీతో తయారు చేసిన క్లాసిక్ కాంజీవరం పట్టు చీరను పెళ్లి సమయంలో దరించనున్నట్లు తెలుస్తోంది. సాంప్రదాయంతో జరిగే ఈ పెళ్లి వేడుక సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ఈ పెళ్లికి 300 మంది గెస్ట్ లు హాజరుకానున్నట్టు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.