Ghani OTT: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ??
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు. నదియా కీలక పాత్రలు పోషించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు. నదియా కీలక పాత్రలు పోషించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సింగ్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ స్టోర్ట్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో విడుదలైన మూడు వారాలలోపే డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos