FWICE – Maldives: మూలిగే నక్కపై తాటికాయ.. ఇక మాల్దీవుల పని ఖతం.!
మాల్దీవులతో ఇండియాకు ఉన్న సత్యసంబంధాలు తెగిపోయాయి. కొద్ది రోజుల క్రితం మాల్దీవుల ముగ్గురు మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీ పై అవమానకరమైన పోస్ట్‌లు చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు ఇలా ఇండియా పై కామెంట్స్ చేయడంతో ‘మాల్దీవులను బహిష్కరించాలని’ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ అవుతోంది. భారతీయులు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌ను పర్యాటక ప్రాంతంగా ఉపయోగించుకోవాలనే అభిప్రాయం ఇప్పుడు అంతటా వ్యక్తం అవుతోంది.
మాల్దీవులతో ఇండియాకు ఉన్న సత్యసంబంధాలు తెగిపోయాయి. కొద్ది రోజుల క్రితం మాల్దీవుల ముగ్గురు మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీ పై అవమానకరమైన పోస్ట్‌లు చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు ఇలా ఇండియా పై కామెంట్స్ చేయడంతో ‘మాల్దీవులను బహిష్కరించాలని’ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ అవుతోంది. భారతీయులు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌ను పర్యాటక ప్రాంతంగా ఉపయోగించుకోవాలనే అభిప్రాయం ఇప్పుడు అంతటా వ్యక్తం అవుతోంది. సినిమా ఫీల్డ్‌లోనూ ఇదే జరుగుతోంది. దీంతో ఇక మాల్దీవులు పని ఖతం అనే టాక్ నెట్టింట వస్తోంది. షూటింగ్.. వెకేషన్స్ కోసం మాల్దీవులకు వెళ్లే బాలీవుడ్ సెలబ్రెటీలకు మాల్దీవులు అత్యంత ఇష్టమైన ప్రదేశం. అయితే ఇప్పుడు బాలీవుడ్ కూడా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు మద్దతు పలుకుతోంది. రణ్‌వీర్ సింగ్‌తో సహా మరికొందరు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ మాల్దీవులకు వ్యతిరేకంగా పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ స్టాఫ్ ఆర్గనైజేషన్.. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లకు లేఖ రాసింది. మాల్దీవులలో బాలీవుడ్ సినిమా షూటింగ్ చేయవద్దని అభ్యర్థించింది. అంతేకాదు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి మాట్లాడిన అవమానకరమైన మాటలను ఖండిస్తూ.. బాలీవుడ్ నిర్మాతలు మాల్దీవుల్లో తమ సినిమాల షూటింగ్‌లను ఆపివేయాలని, బుకింగ్‌లను రద్దు చేయాలని FWICE కోరింది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలందరూ మాల్దీవుల్లో ఎటువంటి షూటింగ్ లేదా నిర్మాణ కార్యకలాపాలను ప్లాన్ చేయవద్దని సూచించింది. మన ప్రధానమంత్రికి, మన దేశానికి బలమైన మద్దతు ఇవ్వడానికి మనమందరం ఈ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలని లేఖలో FWICE పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

