Mahesh Babu - Sitara: మహేష్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన హైద్రాబాదీ ఫ్యాన్స్‌.! వీడియో.

Mahesh Babu – Sitara: మహేష్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన హైద్రాబాదీ ఫ్యాన్స్‌.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 13, 2024 | 10:12 AM

సంక్రాంతి పండగ సందడిని ముందే తీసుకోచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన గుంటూరు కారం సినిమా ఈరోజు జనవరి 12న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే అంచనాలు పెంచేసిన ఈ మూవీ ఇప్పుడు పాజిటివ్ రివ్యూస్ అందుకుంటోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మరోసారి మాస్ యాక్షన్ హీరోగా అదరగొట్టారు మహేష్. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సంక్రాంతి పండగ సందడిని ముందే తీసుకోచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన గుంటూరు కారం సినిమా ఈరోజు జనవరి 12న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే అంచనాలు పెంచేసిన ఈ మూవీ ఇప్పుడు పాజిటివ్ రివ్యూస్ అందుకుంటోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మరోసారి మాస్ యాక్షన్ హీరోగా అదరగొట్టారు మహేష్. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచే థియేటర్ల వద్ద సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాను తన అభిమానులతో కలిసి చూసేందుకు సూపర్ స్టార్ హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MMకి ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు మహేష్‌. ఇక మహేష్ తోపాటు నమ్రత, సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం సుదర్శన్ థియేటర్ కు వచ్చారు. మహేష్ ఫ్యామిలీ థియేటర్ లోపలికి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న అభిమానులు గులాబీల వర్షం కురిపించారు. సితార, మహేష్ పై గులాబీలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos