Dulquer Salmaan: తన లవ్‌ స్టోరీ చెబుతూ సిగ్గు పడిన హీరో

| Edited By: TV9 Telugu

Nov 04, 2024 | 1:49 PM

మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దివంగత హీరోయిన్ సావిత్ర జీవితకథగా వచ్చిన మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు .

ఆ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన అందమైన ప్రేమకథ చిత్రం సీతారామం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో మరోసారి తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా లక్కీ భాస్కర్ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగానే.. రీసెంట్‌గా అన్‌స్టాపబుల్ షోకు వెళ్లిన దుల్కర్ .. తన లవ్‌ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సీజన్ 4 విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ షోకు వచ్చిన దుల్కర్.. ఇందులో తన లవ్ స్టోరీ రివీల్ చేశారు. అమల్ సూఫియా అనే అమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నా అంటూ చెప్పాడు. అంతేకాదు అమల్ సూఫియా.. తన స్కూల్ జూనియర్ అని.. తాను 12వ తరగతిలో ఉన్నప్పుడు తను 8వ తరగతని.. కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు దుల్కర్. అయితే తామిద్దరం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదని.. కానీ అప్పుడప్పుడు తనను చెన్నైలో థియేటర్స్, రెస్టారెంట్స్ లో చూసేవాడనని చెప్పాడు. తనతో పరిచయం ఉంది కానీ.. ఎక్కువగా మాట్లాడుకోలేదని చెప్పాడు. అయితే ఇంట్లో సంబంధాలు చూస్తున్న సమయంలో తాను ఆమెకు ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టానని చెప్పాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రహ్మంగారు చెప్పినట్టే చింత చెట్టుకు పారుతున్న కల్లు

ఆ స్కూలు మొత్తానికీ స్టూడెంట్‌ ఒక్కరే.. టీచర్ ఒక్కరే !!

పెట్రోల్‌ బంకులో లైటర్‌ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ??

కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!

అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. ఆ త‌ర్వాత ఊహించలేరు

Published on: Nov 02, 2024 09:26 AM