కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!
జుట్టు, చర్మ సంరక్షణ కోసం కొబ్బరి నూనెకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. పొడవైన, బలమైన, ఒత్తైన జుట్టును పొందడానికి కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కేవలం జుట్టు సంరక్షణకే కాదు, చర్మ సంరక్షణకు, అందానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మేకప్ తొలగించడానికి కూడా ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా కొబ్బరి నూనెను కంటికింద రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వివిధ కారణాల వల్ల కంటి కింద భాగం ఉబ్బుతుంది. రోజంతా ఫోన్ చూడటం, తగినంత నిద్ర లేకపోవడం, వయస్సు కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరినూనెను కళ్లకింద రాసుకుని తేలికగా చేతులతో మసాజ్ చేయడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది. చిన్న వయసులోనే చాలా సార్లు చర్మంపై ముడతలు వస్తాయి. వివిధ కంపెనీల సౌందర్య సాధనాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ముడుతలకు కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని బిగుతుగా చేసి, కరుకుదనాన్ని తగ్గిస్తుంది. దద్దుర్లు, దురద, చర్మం ఎరుపెక్కడం వంటి చర్మ సమస్యలకు కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మం సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మాన్ని మృదువుగా మార్చి, లోపలి నుండి మృదువుగా చేయడంలో కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని కొల్లాజెన్ చర్మానికి పోషణ అందిస్తుంది. కొబ్బరి నూనె కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండగా ఎదురొచ్చిన సింహం.. ఆ తర్వాత ఊహించలేరు