అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండగా ఎదురొచ్చిన సింహం.. ఆ తర్వాత ఊహించలేరు
ఇటీవల అడవి మృగాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. రాత్రి వేళ వీధుల్లో వీర విహారం చేస్తూ తిరుగుతున్న వీడియోలను, ఇళ్ళలోకి చొరబడి పెంపుడు జంతువులను ఎత్తుకెళ్లిన వీడియోలను చూశాం. తాజాగా అలాంటి వీడియోనే మరోటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత భయాన్ని వ్యక్తం చేశారు.
ఈ వీడియోలో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ వీధిలో బైక్‌పై వెళ్తున్నారు. ఆ వీధి మలుపు తిరిగిన వారికి అనుకోని అతిథి ఎదురుపడింది.. ఆ అతిథి ఎవరో చూస్తే మీకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు రాత్రివేళ బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఊర్లోకి వచ్చిన తరువాత ఓ మూలమలుపు వద్దకు చేరుకున్నారు. అక్కడ మలుపు తిరుగుతుండగా ఎదురుగా భయంకరమైన ఆకారం కనబడింది. ఏంటని పరిశీలించగా సింహం అక్కడ నిలబడి ఉంది. చచ్చామురా దేవుడో అనుకుంటూ బైక్‌పై వెనకాల కూర్చుని ఉన్నవ్యక్తి వెంటనే కిందకు దూకేసి అటునుంచి అటే పారిపోయాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి సైతం బతుకు జీవుడా అని వాహనాన్ని వదిలి అతను కూడా పరుగులు పెట్టాడు. వీరిని చూసిన సింహం ఎక్కడికి పారిపోతారురా అన్నట్టుగా వారిని వెంబడించింది. అయితే ఆ వ్యక్తులు సింహంనుంచి తప్పించుకున్నట్టే తెలుస్తోంది. కాగా, ఈ ఘటన గుజరాత్‌లో జరిగినట్టు సమాచారం. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ వీడియో చాలా పాతదేనని తెలిసింది. అయితే తాజాగా ఈ వీడియో మళ్లీ వైరల్ అయ్యింది. వీడియో చూసిన ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేణుదేశాయ్ రిక్వెస్ట్ తో ఉపాసన ఆర్థిక సాయం !!
ఓరీ దేవుడా.. కట్టెల కోసం కొండపైకి వెళ్తే.. తల్లీబిడ్డలపై దాడి చేసిన కందిరీగలు.. చివరికి ??
Pushpa 2: ఇండియన్ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్ !!
రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

