Dulquer Salmaan: దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్..
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్కు తెలుగు చిత్రపరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉంది. మహానటి, సీతారామం వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో అడియన్స్ మందుకు వచ్చాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
దుల్కర్ పేరు..నెట్టింట మార్మోగుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లో దుల్కర్ దగ్గరున్న కార్ల గురించి.. లక్కీ భాస్కర్ సినిమాలో.. ఉన్న వింటేజ్ కార్ గురించి ఈ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పిన ఇంట్రెస్టింగ్ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ రిలీజ్‌కు ముందు.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వెళ్లిన లక్కీ భాస్కర్ టీం.. బాలయ్యతో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ఈ మూవీలో కొన్ని పాత కార్లు వాడాల్సిన సందర్భం వచ్చిందని.. అందుకోసం నిస్సాన్ పెట్రోల్ వేరియంట్ జీప్ మోడల్ ను వాడామని అన్నారు. అయితే ఈ కారు ఎవరిదో కాదు.. దుల్కర్ సల్మాన్ దే అంటూ చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశాడు ఈ డైరెక్టర్. అంతేకాదు దుల్కర్ సల్మాన్ దగ్గర మొత్తం 70 కార్ల వరకు ఉన్నాయని.. చెప్పి అందరికీ దిమ్మతిరిగేలా చేశాడు వెంకీ అట్లూరి. వాళ్ల ఆవిడకు తెలిస్తే తిడుతుందని కొన్ని కార్లు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఇళ్లలో దాస్తాడని టాప్ సీక్రెట్ చెప్పాడు ఈ డైరెక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.