Vicky Kaushal: అందరికీ షాకిస్తున్న ఛావా హీరో సంపాదన..

Updated on: Feb 20, 2025 | 12:32 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు హీరో విక్కీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 130 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలై.. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది.

ఇక ఇందులో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో గత మూడు రోజులుగా ఈ సినిమాకు దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.121 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి రెమ్యునరేషన్‌గా విక్కీ ఎంత తీసుకున్నాడనే దానిపై చర్చ కూడా మొదలైంది. ఛావా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం.. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా విక్కీ యాక్టింగ్ అందర్నీ మెస్మరైజ్ చేస్తుండడంతో.. ఇప్పుడు అందరూ విక్కీ కౌషల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై ఓ లుక్కేస్తున్నారు. దాంతో పాటే ఛావా సినిమా కోసం విక్కీ తీసుకున్న రెమ్యునరేషన్ ఆరా తీస్తున్నారు. సాధారణంగా విక్కీ కౌశల్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.15 నుంచి రూ.20 కోట్లు వసూలు చేస్తాడట. ఇక ఛావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ 10 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్‌మోదీ.. ఆమె ఎవరంటే..

మహాకుంభమేళాలో హెలికాఫ్టర్ సేవలు.. టికెట్ ధర ఎంతంటే ??

దారుణం.. కోడలికి హెచ్‌ఐవీ వైరస్ ఉన్న ఇంజెక్షన్‌ ఇచ్చి

మీ వయసును తగ్గించే ఆహారాలు ఇవే.. మీ ముఖంలో ఎప్పటికీ యవ్వనపు మెరుపు

Rashmika Mandanna: ‘ఊరిస్తూ.. ఇంకెన్నాళ్లు ఈ ప్రేమాయణం’