Jai Hanuman: ‘హనుమాన్ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా.!’ ప్రశాంత్ వర్మ.
ఎలాంటి హడావిడి లేకుండా.. భారీ తారగణం కాకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఎలాంటి హడావిడి లేకుండా.. భారీ తారగణం కాకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా రాబోతున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలను మరింతగా పెంచేలా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్టేట్ వచ్చింది. ఇక రీసెంట్‌గా షూటింగ్ మొదలైన జైహనుమాన్ సినిమా నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రాముడికి హనుమంతుడు ప్రమాణం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ప్రేక్షకులకు మాటిస్తున్నట్లు చెప్పారు.
“ఈ పవిత్రమైన రోజు సందర్భంగా శ్రీరాముడి దివ్య ఆశీర్వాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మాటిస్తున్నాను. మునుపెన్నడు లేని అనుభూతిని.. జీవితకాలం జరుపుకునే చలన చిత్రాన్ని మీకు అందిస్తానని.. ఈసారి మనందరికీ మరింత ప్రత్యేకం కానుంది” అంటూ ట్వీట్ చేశారు. ఇక డైరెక్టర్ చేసిన ట్వీట్ పక్కకు పెడితే.. షేర్ చేసిన పోస్టర్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫోటోలో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తున్న హనుమాన్ చేయి.. నీలి వర్ణంలో ఉన్న రాముడి చేయి అందర్నీ తెలియని భక్తి భావాన్ని కలిగేలా చేస్తోంది. ఈ సినిమాపై తెలియని అంచనాలను కూడా పెంచేస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!