హీరోయిన్లకు ఇంకో అవకాశం ఇస్తున్న డైరెక్టర్లు

Edited By:

Updated on: Nov 24, 2025 | 8:35 PM

సిల్వర్‌ స్క్రీన్‌పై కెమిస్ట్రీ, నటన మెప్పిస్తే హీరోయిన్లను దర్శకులు మళ్లీ మళ్లీ తమ సినిమాల్లో తీసుకుంటారు. రాబోయే పలు చిత్రాల్లో ఇలాంటి డైరెక్టర్-హీరోయిన్ కాంబోలు, హీరో-హీరోయిన్ జోడీలు పునరావృతమవుతున్నాయి. సుకుమార్-రష్మిక, సిద్ధార్థ్ ఆనంద్-దీపిక, సాయిపల్లవి వంటి ఉదాహరణలు ఈ ట్రెండ్‌ను స్పష్టం చేస్తున్నాయి. ఇది పరిశ్రమలో విజయవంతమైన ఫార్ములాగా మారింది.

సిల్వర్‌ స్క్రీన్‌ మీద కెమిస్ట్రీ బావుంటే హీరో – హీరోయిన్ల జోడీ రిపీట్‌ అవుతుంది. హీరోయిన్‌లో యాక్టింగ్‌ పొటెన్షియల్‌ మెండుగా ఉంటే డైరక్టర్లు తమ నెక్స్ట్ సినిమాల్లో నాయికల్ని రిపీట్‌ చేస్తారు. అలా ఇప్పుడు సెట్స్ మీదున్న కొన్ని సినిమాల్లో డైరక్టర్‌ – హీరోయిన్‌ కాంబో రిపీట్‌ అవుతోంది. ఇంతకీ ఏయే సినిమాల్లో? పుష్ప3 ఎప్పుడు మొదలుపెట్టినా హీరోయిన్‌ రష్మికనే. శ్రీవల్లి కేరక్టర్‌కి వంద వంద శాతం న్యాయం చేశారు రష్మిక అంటూ పొగుడుతూనే ఉన్నారు సుకుమార్‌. అంత మంచి నటితో పనిచేసినప్పుడు సెట్‌ అంతా పాజిటివ్‌గా ఉంటుందన్నది సుకు చెప్పే మాట. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్స్ సక్సెస్‌ అయినంత మాత్రాన సీక్వెల్స్ లో వాళ్లే ఉండాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే కల్కి2లో దీపిక నటించడం లేదు. కానీ, సిద్ధార్థ్‌ ఆనంద్‌తో కింగ్‌ చేస్తున్నారు దీపిక. ఫైటర్‌ కమర్షియల్‌గా సూపర్‌ సక్సెస్‌ కాకపోయినా రిపీట్‌ అవుతోంది వాళ్ల ప్రొఫెషనల్‌ రిలేషన్‌. రీసెంట్‌ టైమ్స్ లో సాయిపల్లవి తన యాక్టింగ్‌తో కట్టి పడేసిన సినిమా అమరన్‌. ఈ మూవీ కెప్టెన్‌ రాజ్‌కుమార్‌ పెరియసామితో ధనుష్‌ పక్కన మళ్లీ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు సాయిపల్లవి. తనతో వర్క్ చేసిన హీరోయిన్లను ఏదో రకంగా నెక్స్ట్ సినిమాల్లో రిపీట్‌ చేసే అలవాటుంది అనిల్‌ రావిపూడికి. ఇప్పుడు మన శంకరవరప్రసాద్‌లో తమన్నాతో స్టెప్పులేయిస్తున్నారు. ఫ్యామిలీమేన్‌ టీమ్‌తోనూ, శివనిర్వాణతోనూ రిపీట్‌ అవుతున్నారు సామ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ

సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్

ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??

నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి

స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్