తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ
తెలుగు మార్కెట్‌లో పట్టు సాధించడానికి, దీర్ఘకాల కెరీర్ కోసం హీరోయిన్లు భాష నేర్చుకుంటున్నారు. ప్రియాంక చోప్రా, ఇమాన్వీ వంటి వారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ, తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీలు సైతం టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి తెలుగుపై పట్టు సాధిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ ఇండస్ట్రీకి ఎంతో ప్రయోజనకరంగా మారుతోంది.
హీరోయిన్లు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నేషనల్ లెవల్‌లో సత్తా చాటుతున్నా… తెలుగు మార్కెట్‌లో పట్టుకోసం ట్రై చేస్తున్నారు. అందుకే కెరీర్ స్టార్టింగ్‌లోనూ లాంగ్ జర్నీ కోసం కష్టపడుతున్నారు. కొత్తగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న బ్యూటీస్‌లో ఈ డెడికేషన్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు ప్రియాంక చోప్రా. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ అవుతున్నారు పీసీ. అంతేకాదు నెక్ట్స్ ఈవెంట్స్‌లో తెలుగులో స్పీచ్ ఇస్తానంటూ… ఎనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లోనే ప్రామిస్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే భాష నేర్చుకోవాల్సిందే ఫిక్స్ అవుతున్నారు హీరోయిన్లు. ప్రభాస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఆల్రెడీ తెలుగు ట్యూషన్స్‌కి అటెండ్ అవుతున్నారు. సౌత్‌లో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న బాలీవుడ్ బ్యూటీస్ కూడా భాష మీద పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రిపులార్‌లో నటించిన ఆలియా భట్ అప్పట్లోనే డైలాగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ, త్వరలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే ఆలోచనలో ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో డబ్బింగ్ మీద డిపెండ్ అయిన నయనతార, తమన్నా, అనుష్క లాంటి అందాల భామలు కూడా ఇప్పుడు ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకునేందుకే ట్రై చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి కూడా మంచిదే అంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ
సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్
ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??
నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి
స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

