Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Phani CH
|

Updated on: Jun 24, 2025 | 5:21 PM

Share

పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో కడుతున్నారు. బాలీవుడ్ లో పేరున్న దర్శకుల నుంచి కూడా బన్నీకి ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ మధ్యన సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడని పుకార్లు షికార్లు చేశాయి.

అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ రెండుసార్లు సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ కాంబినేషన్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈలోగా.. అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అల్లు అర్జున్ సినిమాల లైనప్ కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో నటించాల్సిన ఓ సూపర్ హీరో సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలోనే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో ‘శక్తిమాన్’. ఈ కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోందనే వార్తలు గత సంవత్సరం నుంచి వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ శక్తిమాన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు, రణవీర్ సింగ్ బదులుగా అల్లు అర్జున్ శక్తిమాన్ పాత్రను పోషిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే శక్తిమాన్ అవతారంలో బన్నీ AI జనరేటెడ్ పోస్టర్లు నెట్టింట బాగా హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు శక్తిమాన్ సినిమాకు మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై బాసిల్ జోసెఫ్ రియాక్టయ్యారు. శక్తిమాన్ సినిమాలో రణవీర్ సింగే హీరోగా ఉంటాడని బాసిల్ క్లారిటీ ఇచ్చారు. అందులో ఎటువంటి మార్పు లేదని తేల్చి చెప్పాడు బాసిల్. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో కలిసి ఓ హాలీవుడ్ తరహా మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమాలో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి వీరి కాంబోలో తెరకెక్కే మూవీ కథేంటో తెలియాలంటే మరి కొన్ని రోజుల వెయిట్ చేయాల్సిందే..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుష్ఫ విలన్ గ్యారేజీలో.. వోక్స్ వ్యాగన్‌ లోనే స్పీడెస్ట్ కార్‌!

బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!

రోడ్డుపక్కన ఫుడ్‌ స్టాల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కోతి.. సెల్ఫీలు తీసుకుంటున్న కస్టమర్స్‌

ఊపిరితిత్తుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు

టాప్‌ సీక్రెట్‌.. క్యారెట్‌ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే..