షాకింగ్ న్యూస్.. బ్రెయిన్ ఎన్యోరిజమ్ వ్యాధితో బాధపడుతున్ సల్మాన్
సల్మాన్ ఖాన్! ప్రస్తుతం ఆయన వయసు 59 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ గడిపేస్తున్నారు. కానీ ఈ హీరో పెళ్లి పై మాత్రం నిత్యం ఫిల్మ్ వర్గాల్లో ఏదోక చర్చ నడుస్తుంటుంది. స్టార్ హీరోయిన్లతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సల్లూ భాయ్..ఇప్పటికీ ఒంటరిగానే ఉండడంపై అనేక వార్తలు ప్రచారమవుతుంటాయి.
తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సల్మాన్. వివాహం, విడాకులు భావోద్వేగపరంగా.. ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలని అన్నారు. వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ తన లైఫ్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఆరోగ్య సమస్యలున్నట్టు చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు సల్మాన్. తాను ఏవీ మాల్ఫోర్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజమ్ అనే సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు సల్మాన్. ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుందన్న ఆయన.. యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచూ గాయాలు అవుతుంటాయన్నారు. ఇక ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి, ఏవీ మాల్ఫోర్మేషన్ అంటే రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి, బ్రెయిన్ ఎన్యోరిజమ్ అంటే మెదడులో వచ్చే చిన్నపాటి సమస్య లతో తాను బాధపడుతున్నట్టు సల్మాన్ రివీల్ చేశారు. అంతేకాదు తాను ఈ సమస్యతలో బాధపడుతున్నప్పటికీ.. పనిచేస్తున్నా అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం తనకు లేదన్నారు సల్మాన్. చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే వాటిని అధిగమించేవాడిని. కానీ ఇప్పుడు వీటిని అధిగమించేందుకు తనను తాను రీస్టార్ట్ చేసుకుంటున్నాంటూ చెప్పుకొచ్చారు ఈయన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
పుష్ఫ విలన్ గ్యారేజీలో.. వోక్స్ వ్యాగన్ లోనే స్పీడెస్ట్ కార్!
బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!
రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కోతి.. సెల్ఫీలు తీసుకుంటున్న కస్టమర్స్

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
