Dil Raju: 'పవన్‌  కారణంగా.. చాలా నష్టపోయా'

Dil Raju: ‘పవన్‌ కారణంగా.. చాలా నష్టపోయా’

Phani CH

|

Updated on: Dec 30, 2022 | 9:29 AM

దిల్‌ రాజు! ఆయన పట్టిందల్లా బంగారం అంటారు. సినిమా జడ్జిమెంట్లో ఆయనే తోపంటారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఆయనకు తిరుగులేదంటారు. థియేటర్లను హోల్డ్ చేయడంలో ఆయనది మాస్టర్ మైండ్ అంటారు.

దిల్‌ రాజు! ఆయన పట్టిందల్లా బంగారం అంటారు. సినిమా జడ్జిమెంట్లో ఆయనే తోపంటారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఆయనకు తిరుగులేదంటారు. థియేటర్లను హోల్డ్ చేయడంలో ఆయనది మాస్టర్ మైండ్ అంటారు. ఇక ప్రొడ్యూసర్‌గా మారి ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నారని అంటున్నారు. వరుస హిట్లతో.. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారంటారు. కాని ఇదే స్టార్ ప్రొడ్యూసర్ తాజాగా ఓ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన జీవితంలో లాభాలే కాదు.. తట్టుకోలేని నష్టాలు కూడా ఉన్నాయని కామెంట్ చేశారు. అది కూడా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ సినిమా వల్లనే అంటూ చెప్పి అందర్నీ షాక్ చేశారు. ఎస్ ! పవన్‌ కళ్యాణ్ సినిమాతో డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఎదిగిన దిల్ రాజు.. అదే పవన్‌ కళ్యాణ్ అజ్ఙాతవాసి సినిమా వల్ల కోట్లలో కోల్పోయా అంటూ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఆ ఒక్క సినిమానే కాదు.. అదే సంవత్సరం రిలీజైన మహేష్ స్పైడర్ ను కూడా తానే నైజాంలో.. డిస్ట్రిబ్యూట్‌ చేశానని.. అది కూడా తనకు తీవ్ర నష్టాల్ని మిగిల్చిందన్నారు. ఈ రెండు సినిమాల వల్ల.. తాను తీవ్రంగా దెబ్బతిన్నా అంటూ… అనాటి రోజులను.. ఆ భారీ నష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

Published on: Dec 30, 2022 09:29 AM