Deepika-Ranveer: దీపికా-రణవీర్ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా.?
బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొణె తమ ముద్దుల కుమార్తె పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈమేరకు చిన్నారి పాదాల ఫోటోను షేర్ చేశారు. అంతేకాదు 'దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే తను. మా మనసు సంతోషంతో, ప్రేమతో ఉప్పొంగిపోతోంది' అని తమ పోస్టులో రాసుకొచ్చారు ఈ స్టార్ కపుల్.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ – దీపికా పదుకొణె దంపతులకు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పండంటి ఆడపిల్ల జన్మించింది. ఈ క్రమంలో దీపావళి పండుగను పురస్కరించుకుని తొలిసారి చిన్నారి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు రణ్‌వీర్ – దీపికా. అంతేకాదు తమ ముద్దుల తనయ పేరును కూడా ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్లు తెలిపారు.
దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే’ ఈమె అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. క్యూట్ అంటూ లవ్ ఎమోజీలు జోడించారు. 2018లో రణ్‌వీర్ – దీపిక వివాహ బంధంతో ఒకటయ్యారు. కల్కి 2898 ఏడీతో అలరించిన దీపిక..సింగమ్ అగైన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఇందులో రణ్‌వీర్ అతిథి పాత్రలో సందడి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి

