Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

|

Dec 23, 2024 | 9:14 AM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ కామెంట్స్‌..సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌ చేసిన బడా మూవీస్‌కు షాక్‌ ఇచ్చాయి. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీరియస్‌ అయిన ముఖ్యమంత్రి.. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని అసెంబ్లీలో స్పష్టం చేశారు. సినిమాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.

సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు.. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.సీపీఐ నారాయణ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ రేట్ల పెంపును ఖండించిన నారాయణ.. సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇకమీదట పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచబోమన్న సీఎం రేవంత్ ప్రకటనను స్వాగతించారు తెలంగాణ సింగిల్ స్క్రీన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి.సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌ చేసిన బడామూవీస్‌కు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం షాకే అంటున్నారు..మూవీ ఎక్స్‌పర్ట్స్‌. డిసెంబరు 5న రిలీజైన ‘పుష్ప2’ మూవీకి ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తెలంగాణ సర్కారు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. విడుదలకు ముందు రోజే పెయిడ్‌ ప్రీమియర్‌ షోలకూ అనుమతి ఇచ్చింది. దీంతో ‘పుష్ప2’ భారీగా వసూళ్లు సాధించింది. తొలిరోజు అత్యధికంగా రూ.294 కోట్లు వసూలు చేసి చరిత్రకెక్కింది. ఇప్పుడు ఏకంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రానున్న సినిమాల వసూళ్లపై భారీ ఎఫెక్ట్‌ చూపే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.