Kantara: Chapter 1: 1000 కోట్లా.. అంత సీన్ ఉందంటారా ??
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద నిజంగానే రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలై నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 335 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి తోడు ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా లాంటి ఫిల్మ్ పర్సనాలిటీస్‌కు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది.
నిజానికి ఈ సినిమాపై విడుదలకు ముందు ఇంత భారీ హైప్ లేదు.. సైలెంట్‌గానే వచ్చింది కాంతార ఛాప్టర్ 1. కానీ దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంది. పౌరాణిక నేపథ్యం, అద్భుతమైన విజువల్స్, రిషబ్ శెట్టి నటన ఇవన్నీ సినిమాను నిలబెట్టాయి. ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. కేవలం వీకెండ్‌లోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం అనేది సినిమాకు వస్తున్న ప్రజాదరణకు నిదర్శనం. కాంతార సినిమా కలెక్షన్ల దూకుడును గమనిస్తే.. వివిధ ప్రాంతాల్లో అద్భుతమైన వసూళ్లు నమోదయ్యాయి. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹235 కోట్లు వసూలు చేయగా.. నాలుగో రోజు ఒక్కరోజే ₹110 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు ₹40 కోట్లు షేర్, హిందీ బెల్ట్‌లో ₹75 కోట్లకు పైగా నెట్, కన్నడ నుంచి ₹90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమాకు అనూహ్య స్పందన లభించడంతో ₹70 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫిక్షన్, యాక్షన్ కలిపి రిషబ్ శెట్టి చేసిన మ్యాజిక్ వర్కవుట్ అయింది.. కుటుంబ ప్రేక్షకులు, యూత్ నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. ఇదే ఊపు కొనసాగితే, ఈ సినిమాకు ₹700 కోట్లు సులభంగా వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా చూపిస్తున్న వసూళ్లు చూస్తుంటే.. ట్రేడ్ వర్గాలు ₹1000 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని బలంగా అంచనా వేస్తున్నాయి. కానీ ఇది జరగాలంటే మాత్రం అద్భుతం జరగాల్సిందే. ఈ వసూళ్లు కేవలం కన్నడ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. వీకెండ్ జోరు తర్వాత వీక్ డేస్‌లో సినిమా వసూళ్లు ఎలా ఉంటుందనేది కీలకంగా మారిందిప్పుడు. సాధారణంగా పెద్ద సినిమాలకు సైతం వీక్ డేస్‌లో కలెక్షన్లు పడిపోవడం సహజం. అయితే ‘కాంతార ఛాప్టర్ 1’కు వచ్చిన బ్లాక్‌బస్టర్ టాక్.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కారణంగా ఈ సినిమా ఈ దూకుడును వీక్ డేస్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ‘కాంతార’ తొలిభాగం సుమారు ₹400 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుత ప్రీక్వెల్ అద్భుతమైన ఓపెనింగ్ తీసుకున్నా.. లాంగ్ రన్‌లో పోటీని తట్టుకుని నిలబడగలిగితేనే ₹1000 కోట్లు దాటడం సాధ్యం అవుతుంది. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా చూపిన ప్రతిభ.. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు ఈ అద్భుతానికి హెల్ప్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

