బాబుకు దక్కాల్సింది తరుణ్ ఎగరేసుకుపోయాడు !! ఇదే లక్కంటే !!
మీకు తెలుసా.. ? అప్పట్లో మహేష్ చేయాల్సిన ఓ సినిమాతో లవర్ బాయ్ తరుణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని! ఆ సినిమా రిజల్ట్‌తో తన ఫిల్మ్ కెరీర్లో ఒక్క సారిగా దూసుకుపోయాడని..! ఆ సినిమా మరేదో కాదు.. తరుణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ బెస్ట్ మూవీగా ట్యాగ్ తెచ్చుకున్న 'నువ్వు లేక నేను లేను' మూవీ. 2002లో విడుదలైన ఈ సినిమా.. తెలుగు వాళ్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
తరుణ్ హీరోగా, డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాకు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే.. మొదట ఈ సినిమాను మహేష్ తో చేద్దామని ప్రొడ్యూసర్ సురేష్ బాబు అనుకున్నారట. అనుకోవడమే కాదు.. డైరెక్టర్ కాశీ విశ్వనాథ్‌కి ఇదే విషయం చెప్పారట కూడా..! అయితే అందుకు డైరెక్టర్ కాశీ విశ్వనాథ్.. హీరోగా మహేష్ వద్దంటూ ఓ వివరణ ఇచ్చాడట. మహేష్‌తో సినిమా చేసేందుకు చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూలో ఉంటారు. కాబట్టి.. తన సినిమా చాలా లేట్ అవుతుందని.. దానికి బదులు తరుణ్‌తో తీసేస్తే త్వరగా అయిపోతుందని.. పైగా అంతకు ముందు నువ్వే కావాలి సినిమా హిట్టైందని ప్రొడ్యూసర్‌కు వివరించాడట డైరెక్టర్ కాశీ. అయితే ఆయన మాటలకు సురేష్ బాబు కూడా కన్విన్స్ అవ్వడంతో తరుణే ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ అయ్యాడు.ఇదే విషయాన్ని గతంలో ఈ మూవీ ప్రొడ్యూసర్ , డైరెక్టర్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో పెట్రోలు కొట్టిస్తుండగా భగ్గున చెలరేగిన మంటలు
యువతి అనారోగ్యాన్ని మంత్రంతో పోగొడతానన్నాడు.. చివరికి..
ఓరి బుడ్డోడా.. మ్యాగీ కోసం ఎంత పనిచేశాడు
ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్ సేవలు మరింత సులభం
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

