ఈ అరవ ప్రేమకథ ఎలా ఉంది? హిట్టా..? ఫట్టా..?

Updated on: Aug 24, 2025 | 7:01 AM

తమిళంలో మంచి విజయం సాధించిన బన్ బట్టర్ జామ్ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు మేకర్స్. రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ చిత్రంలో ప్రేమతో పాటు స్నేహాన్ని కూడా చూపించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.. చంద్రు అలియాస్ రాజు జయమోహన్, మధుమిత అలియాస్ ఆద్య ప్రసాద్ ఇంట‌ర్ పూర్తి చేసుంటారు.. ఇద్దరూ ఈ జనరేషన్ కిడ్స్.. ఫుల్ ఫాస్ట్ ఉంటారు.

కాకపోతే ఇంట్లో మాత్రం స్వాతిముత్యాల్లా బిల్డప్ ఇస్తుంటారు. మరోవైపు వాళ్ల పేరెంట్స్‌కు ఇదివరకే పరిచయం ఉండటంతో.. ఇంటర్ అయిపోగానే వాళ్లిద్దరికి పెళ్ళి చేయాలనుకుంటారు. బయట చూసిన సంబంధాలైతే చెడిపోతాయని.. తమ పిల్లలిద్దరినీ తామే కలపాలనుకుంటారు. కానీ చంద్రు, మధు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇదే సమయంలో చంద్రు ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాక నందిని అలియాస్ భ‌వ్య త్రిఖతో ప్రేమలో పడతాడు. కాకపోతే నందినిని ప్రేమించడం చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ అలియాస్ మైకేల్ తంగ‌దురై కు నచ్చదు.. అదే అమ్మాయిని తను కూడా లవ్ చేస్తుంటాడు. ఆ విషయం చెప్పకుండా స్నేహితుడిని దూరం పెడతాడు. మరోవైపు మధుమిత.. ఆకాష్ అలియాస్ VJ పప్పుని ప్రేమిస్తుంది. ఈ ట్రయాంగిల్ స్టోరీ చివరికి ఏ మలుపు తిరిగింది.. అసలు చంద్రు, మధు పెళ్లి జరిగిందా లేదా..? ఎవరి ప్రేమ ఎటు వైపు వెళ్లింది? అనేది ఈ మూవీ స్టోరీ. బ‌న్ బ‌ట‌ర్ జామ్.. టైటిల్‌కు తగ్గట్లుగానే ఇది పూర్తిగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ మధ్యే తమిళంలో విడుదలై అక్కడి యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇదే పేరుతో తెలుగులోనూ వచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్ అలా ఎందుకు పెట్టారు అంటే.. హీరో అండ్ గ్యాంగ్ ఎప్పుడూ అదే హోటల్‌లో కూర్చుంటారు కాబట్టి.. అంతే తప్ప కథకు సంబంధం ఉండదు. దర్శకుడు మిర్దత్ తన కథను పూర్తిగా యువతను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు. లవ్ టుడే సినిమాలో ప్రదీప్ రంగనాథన్ చూపించిన కొన్ని సన్నివేశాలు ఇందులోనూ ఉన్నట్లు అనిపిస్తాయి. నేటి జనరేషన్‌ను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురుషులకన్నా మహిళల పైనే..నమ్మకం ఎక్కువట! ఎందుకో తెలుసా

బాలిక డెంటల్‌ ఎక్స్‌రే చూసి అంతా షాక్.. తల్లి మాట వినకుంటే ఎంత పనైంది

Jio: జియో యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌

శుభవార్త.. ఏసీలు, టీవీలు మరింత అగ్గువ కేంద్రం సంచలన నిర్ణయం

‘మీ సపోర్ట్ ఎప్పుడూ అవసరం’ CM రేవంత్‌కు మెగా‌స్టార్‌ స్పెషల్ మెసేజ్‌