పాపం! ఆ సినిమా కూడా చేసుంటే.. ఈ బేబీ ఎక్కడికో వెళ్లిపోయేదిగా..
వైష్ణవి చైతన్య.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షణ్ముక్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు, ఇన్ స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. బేబీ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బేబీ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వైష్ణవికి.. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.దాంతో పాటే బేబీ టైంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ఈమె తలుపు తట్టిందట కానీ.. కొన్ని కారణాల వద్దనుకుందట. పదిహేనేళ్ల వయసులోనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసిందట వైష్ణవి. గతంలో బేబీ మూవీ ప్రమోషన్లలో తన జర్నీ గురించి అనేక విషయాలు పంచుకుంది. ఓ ఈవెంట్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాన్స్ చేస్తే ఏడు వందలు ఇచ్చారని తెలిపింది. ఇక బేబీ సినిమాకు ముందు ఆమె రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుందట. అందులో ఒకటి బలగం సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకుంది. అయితే ఈ సినిమాకు ముందుగా వైష్ణవిని ఎంపిక చేసుకున్నారట. కానీ అప్పటికే ఆమె బేబీ సినిమాతో బిజీగా ఉండడంతో బలగం నుంచి తప్పుకుందట. దీంతో బేబీ కోసం బలగం బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన బేబీ మూవీ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమె క్రేజ్ మారిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

