రీ రిలీజ్ సినిమాలకు మళ్లీ క్రేజ్.. రెడీ అయిన వరుస సినిమాలు
రీ రిలీజ్‌ల విషయంలో ఎప్పటికప్పుడు కాస్త జోరు తగ్గినట్లే అనిపిస్తుంది కానీ.. ఏదో ఓ సినిమాతో మళ్లీ వాటికి ఊపొస్తుంది. తాజాగా మరో నాలుగు సినిమాలు రీ రిలీజ్‌లకు రెడీ అయ్యాయి. వాటి తీరు చూస్తుంటే ఈసారి స్క్రీన్స్ షేక్ అయ్యేలాగే కనిపిస్తున్నాయి. తక్కువ గ్యాప్‌లోనే 4 ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాయి.
ఇంతకీ ఏంటా పాత్ బ్రేకింగ్ సినిమాలు..? రీ రిలీజ్ సినిమాల జోరు ఈ మధ్య కాస్త తగ్గింది కానీ పూర్తిగా అంతమైతే కాలేదు. మంచి సినిమా వచ్చినపుడు ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు వచ్చి పాత సినిమాలను చూడ్డానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 11న ఉపేంద్ర సినిమా రీ రిలీజ్ కానుంది. 1999లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది.. మైత్రి మూవీస్ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ మళ్లీ విడుదల కానుంది. 2 పార్ట్స్ కలిపి.. సింగిల్ పార్ట్‌గా విడుదల చేయబోతున్నారు రాజమౌళి. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్, 2017లో వచ్చిన కంక్లూజన్ కలిపి ది ఎపిక్‌గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీనికోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అంతేకాదు.. ప్రభాస్, రానా, అనుష్కతో ఓ ఇంటర్వ్యూ రికార్డ్ చేసారు.. అలాగే నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ శివ కూడా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. అలాగే నాగార్జున పాత్ బ్రేకింగ్ సినిమా శివ రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన శివతో ఇండియన్ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలంటూ నాగార్జునను చాలా రోజులుగా కోరుతున్నారు ఫ్యాన్స్. నవంబర్ 14న ఈ కోరిక తీరబోతుంది.. శివ 4K వర్షన్ గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాను సైతం రీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ అందించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సినిమాను జనవరి 1, 2026న రీ రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ 4 రీ రిలీజ్‌లతో థియేటర్స్ హోరెత్తబోతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్ల విషయంలో ఎందుకు వివక్ష అంటున్న దీపికా పదుకొనే
హిట్ పెయిర్స్‌కు పెరుగుతున్న క్రేజ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

