హిట్ పెయిర్స్‌కు పెరుగుతున్న క్రేజ్
ఇండస్ట్రీలో హిట్ పెయిర్‌కు ఉండే డిమాండ్ వేరు.. ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు ఆ కాంబోను కలపడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ కాంబోస్ చాలానే ఉన్నాయిపుడు. మరో సెన్సేషనల్ జోడీ రెండో సినిమా కలిసి చేయబోతున్నారు. ఎవరా జంట.. ఇంతకీ ఆ రిపీట్ కాంబోస్ ఏంటి..? చూస్తున్నారుగా.. ఈ పాట చిన్న పిల్లల నుంచి అందరికీ నోటెడ్ అయిపోయింది.. అలాగే ఈ జోడీ కూడా..!
కోర్ట్ విజయానికి హర్ష్ రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీ కూడా కారణమే. ఈ జోడీ ఆన్ స్క్రీన్‌పై అదరగొట్టారు. దాంతో ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తూ సినిమా చేస్తున్నారు కోన వెంకట్. బ్యాండ్ మేళం అనే సినిమా ఈ ఇద్దరితో అనౌన్స్ చేసారు కోన. ధమాకాతో రవితేజ, శ్రీలీల జోడీకి మంచి క్రేజ్ వచ్చింది.. మామూలుగానే తన హీరోయిన్స్‌ను వరసగా రిపీట్ చేస్తుంటారు మాస్ రాజా. అలాగే శ్రీలీలకు మరో ఆఫర్ వచ్చింది. మాస్ జాతరలో కలిసి నటిస్తున్నారు ఈ జోడీ. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తక్కువ గ్యాప్‌లో నితిన్‌తోనూ రెండు సినిమాల్లో నటించారు శ్రీలీల. టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆరేళ్ళ తర్వాత కలిసి నటిస్తున్నారు. రాహుల్ సంక్రీత్యన్ సినిమా కోసం ఈ ఇద్దరూ జోడీ కట్టారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది ఈ చిత్రం. ఇక అనిల్ రావిపూడి సినిమాలో మూడోసారి కలిసి నటిస్తున్నారు చిరు, నయనతార. గతంలో సైరా, గాడ్ ఫాదర్‌లో నటించారు ఈ జోడీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

