Pawan Kalyan: బుక్‌ మై షో యాప్‌కు.. భీమ్లా నాయక్ స్ట్రోక్‌..(Video)

Pawan Kalyan: బుక్‌ మై షో యాప్‌కు.. భీమ్లా నాయక్ స్ట్రోక్‌..(Video)

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Feb 22, 2022 | 7:40 PM

బుక్ మై షో కి నైజాంలో ఎదురుదెబ్బ తగిలింది. బుక్ మై షో ద్వారా టికెట్ లు అమ్మకూడదని డిసైడ్ అయ్యారు భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్.

బుక్ మై షో కి నైజాంలో ఎదురుదెబ్బ తగిలింది. బుక్ మై షో ద్వారా టికెట్ లు అమ్మకూడదని డిసైడ్ అయ్యారు భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్. బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద అదనపు భారం పడుతోందనే విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. దానికి బుక్ మై షో కమిషన్ కలిపితే రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకని కౌంటర్ సేల్ చేస్తే బెటర్ అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుక్ మై షో యాజమాన్యం వసూలు చేసే సర్వీస్ ఛార్జి, సినిమా ప్రకటనలు రేట్లు తగ్గించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయం సెటిల్ అయ్యే వరకు థియేటర్ కౌంటర్లో టికెట్స్ విక్రయించాలని భావిస్తున్నారు డిస్టిబ్యూటర్లు.



Published on: Feb 22, 2022 09:15 AM