Jaggu Bhai: ఆనందయ్య మందు ఎఫెక్ట్..!! బాబు వర్సెస్ బాబు.. మధ్యలో ఆనందయ్య… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 14, 2021 | 10:00 AM

సినీ నటుడు, హీరో కమ్ విలన్ జగపతిబాబు‌పై ప్రముఖ హేతువాది బాబు గోగినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో జగపతి బాబు చేసిన కామెంట్స్‌ని పట్టుకుని..

సినీ నటుడు, హీరో కమ్ విలన్ జగపతిబాబు‌పై ప్రముఖ హేతువాది బాబు గోగినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో జగపతి బాబు చేసిన కామెంట్స్‌ని పట్టుకుని.. ప్రస్తుతం ఆయన చేపట్టిన కార్యక్రమాని ఉటంకిస్తూ సెటైర్లు పేల్చారు. ‘అమ్మ నాటీ.. అసలు మ్యాటర్ ఇదా?’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కరోనాకు మందు కనిపెట్టిన విషయం తెలిసిందే. ఈ మందుపై పెను దుమారమే రేగింది. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన జగపతి బాబు.. ఆనందయ్యకు మద్ధతు ప్రకటించారు. ఆయన మందు మంచిదంటూ ప్రశంసించారు. అంతేకాదు.. తాను కూడా ఆ మందును వాడినట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బాబు గోగినేని స్పందించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: MS Dhoni: చిన్న గుర్రం తో ధోని పరుగు పందెం.. నెట్టింట వీడియో వైరల్..

Viral Video: తిమింగలం మింగేసింది.. అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాడు.. ( వీడియో )