MS Dhoni: చిన్న గుర్రం తో ధోని పరుగు పందెం.. నెట్టింట వీడియో వైరల్..

Phani CH

|

Updated on: Jun 14, 2021 | 9:48 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ రధసారథి మహేంద్రసింగ్‌ ధోని.. ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుంటాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ రధసారథి మహేంద్రసింగ్‌ ధోని.. ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుంటాడు. కరోనా ఉద్ధృతి కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఖాళీ సమయం దొరకడంతో ధోని రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరుతున్నాడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో సరదాగా బిజిబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో తన ఫామ్‌హౌజ్‌లో పెంచుకుంటున్న మూగజీవాలతో సరదాగా గడిపేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నాడు.గతనెల ఓ చిన్న గుర్రానికి మసాజ్‌, స్నానం చేయించిన ధోనీ.. తాజాగా మరో చిన్న గుర్రంతో ఆటలాడుతూ కనిపించాడు. దానితో పరుగులు తీస్తున్న వీడియోను ధోని అర్ధాంగి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకేముంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తిమింగలం మింగేసింది.. అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాడు.. ( వీడియో )

Queen Elizabeth: 96 ఏళ్ళు వయస్సు లో బర్త్ డే కేక్ ని భారీ ఖడ్గంతో కట్ చేసిన రాణి ఎలిజెబెత్…. ( వీడియో )