సముద్ర లోకాన్ని ఆవిష్కరించిన అవతార్‌-2 టీజర్‌ అదిరిందిగా..!

మోస్ట్ అవైటెడ్ చిత్రం అవతార్ 2. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ లెజెండరీ డైరక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Phani CH

|

May 10, 2022 | 8:07 PM

మోస్ట్ అవైటెడ్ చిత్రం అవతార్ 2. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ లెజెండరీ డైరక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన అవతార్ చిత్రానికి సిక్వెల్‏గా అవతార్ 2.. ది వే ఆఫ్ వాటర్.. మూవీని రూపొందిస్తున్నారు డైరక్టర్ జేమ్స్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్‏ను మే 9 న విడుదల చేశారు. ఈ ట్రైలర్ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్ తో ప్రారంభంకాగా .. సముద్ర ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లుగా తెలుస్తోంది. అందులో అద్భుతమైన లోకేషన్లు, నీలి సముద్రం అందంగా కనిపిస్తోంది. అద్భుతమైన గ్రాఫిక్ మాయజాలం అడుగుడుగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‏ అవతార్ 2 సినిమాపై అంచనాలను భారీగానే పెంచేసింది. టీజర్‏తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు మేకర్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KGF Chapter 2: కేజీఎఫ్‌ 2 తల్లి పాటకు.. యూట్యూబ్‌లో జన నీరాజనం

ఒక్క నీటిబొట్టు చాలు.. ప్రాణం నిలపడానికి.. గుండెను పిండేస్తున్న వీడియో..!

ఆకలితో ఉన్న పిల్లి.. తన యజమానిని ఏం చేసిందో చూడండి !!

నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu