Allu Arjun: దుబాయ్‌లో అల్లు అర్జున్‌ విగ్రహం.. తొలి టాలీవుడ్‌ హీరోగా రికార్డ్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి దుబాయ్‍ చేరుకున్నారు. ఇందులో విశేషమేముంది అనుకోకండి. విశేషం ఉంది. దుబాయ్‌లో ఈ ఐకాన్‌ స్టార్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు, తొలి తెలుగు హీరోగా రికార్డ్‌ సెట్‌ చేశాడు. దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లుఅర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఆ విగ్రహావిష్కరణకు కటుంబంతో సహా బన్నీ దుబాయ్‌ వెళ్లారు. అదేంటి.. ఇప్పటికే మహేష్‌బాబు, ప్రభాస్‌ విగ్రహాలు ఈ మ్యూజియంలో పెట్టారు కదా అనుకుంటున్నారా?

Allu Arjun: దుబాయ్‌లో అల్లు అర్జున్‌ విగ్రహం.. తొలి టాలీవుడ్‌ హీరోగా రికార్డ్‌

|

Updated on: Mar 27, 2024 | 6:40 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి దుబాయ్‍ చేరుకున్నారు. ఇందులో విశేషమేముంది అనుకోకండి. విశేషం ఉంది. దుబాయ్‌లో ఈ ఐకాన్‌ స్టార్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు, తొలి తెలుగు హీరోగా రికార్డ్‌ సెట్‌ చేశాడు. దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లుఅర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఆ విగ్రహావిష్కరణకు కటుంబంతో సహా బన్నీ దుబాయ్‌ వెళ్లారు. అదేంటి.. ఇప్పటికే మహేష్‌బాబు, ప్రభాస్‌ విగ్రహాలు ఈ మ్యూజియంలో పెట్టారు కదా అనుకుంటున్నారా? మీ ఆలోచన కరెక్టే.. కానీ వారి విగ్రహాలు లండన్‌లోని మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బన్నీది మాత్రం దుబాయ్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ఏ టాలీవుడ్‌ హీరోకి ఈ గౌరవం దక్కలేదు. తొలిసారి బన్నీకి ఈ అవకాశం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీ రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇక్కడ ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెలల పాపను ఇంట్లో ఉంచి పది రోజు పాటు ఇంటికి తాళం !! చివరికి ??

మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా.. వరుడు అలా ఉండాలి !!

దయచేసి సినిమా ఛాన్సులు ఇవ్వండి’ వేడుకుంటున్న సీనియర్ యాక్టర్

Samantha: సమంత విషయంలో ఊహించని ట్విస్ట్.. సుక్కు ప్లానే వేరుగా

Mrunal Thakur: బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్.. షాకైన ఫ్యాన్స్‌

Follow us